నల్గొండ

కేంద్ర మంత్రి స్మృతి ఇరానిని కలిసిన పోచంపల్లి నాయకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్ పోచంపల్లి, జూలై 29 : చేనేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించి వారిని ఆదుకోవాలని కేంద్ర చేనేత, జౌళి శాఖామంత్రి స్మృతి ఇరానినీ ఢిల్లీలో కలసి తెలంగాణ చేనేత నాయకులు విన్నవించారు. శుక్రవారం నాయకులు ఆలిండియా హ్యాండ్‌లుమ్ బోర్డు డైరెక్టర్ ధనంజయ్య మాట్లాడుతూ కార్మికుల పరిస్థితిని స్వయంగా తెలుసుకోవాలని కోరామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆకు యంత్రాలను సబ్సీడీపై కార్మికులకు అందజేయాలని, జాతీయ చేనేత విధానాన్ని ప్రకటించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత నాయకులు చింతకింది మల్లేషం, జహంగీర్, శ్రీనివాస్, గీత తదితరులు పాల్గొన్నారు.