నల్గొండ

రద్దు వద్దు .. మంత్రులను బర్తరఫ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, జూలై 30: ఎంసెట్-2ను రద్ధు చేయడం అన్యాయమని సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నార్కట్‌పల్లిలో విలేఖరులతో మాట్లాడుతు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను పట్టించుకోకుండా ఏకపక్షంగా ఎంసెట్‌ను రద్ధు చేయడం ప్రభుత్వ అసమర్ధ పాలనకు నిదర్శనమన్నారు. లీకేజీలో భాగస్వామ్యమైన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు నైతిక బాధ్యతగా మంత్రులు కడియం, లక్ష్మారెడ్డిలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వ అసమర్ధత పాలనతో ఎంసెట్-2లీకేజి వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. సీఎం కెసిఆర్ ఫాంహౌజ్‌లో ఉంటుండటంతో రాష్ట్ర పాలన గాడితప్పుతుందన్నారు. రామన్నపేట మండలంలో కక్కిరేణి గ్రామంలో తెలంగాణ చెత్తతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీటీసి దూదిమెట్ల సత్తయ్యగౌడ్, ఎంపిటిసి ఐతరాజు యాదయ్య, నాయకులు సైదులు తదితరులు పాల్గొన్నారు.

వర్గీకరణ కోసం ఎంఎస్‌ఎఫ్ ర్యాలీ
నల్లగొండ టౌన్, జూలై 30: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌తో చలోఢీల్లి చేపట్టిన ఎమ్మార్ఫీఎస్‌కు మద్ధతుగా ఎంఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోని ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం
యాదగిరిగుట్ట రూరల్: పార్లమెంటు సమావేశాలలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్లాలనే డిమాండ్‌తో యాదగిరిగుట్టలో ధర్నా ,రాస్తారోకో నిర్వహించారు. తదనంతరం మంద శంకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తున్న మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద దీక్షలు చేపట్టి 12 రోజులు కావస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎస్సీ వర్గీకరణ కోసం అనేక ఉద్యమాలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నల్ల చంద్రస్వామిమాదిగ, జిల్లా కార్యదర్శి ఎర్రగుంట్ల ప్రభాకర్‌మాదిగ, బర్ల శివయ్య,బూడిద జానీ,తాటికాయల నరేందర్, సుర్పంగ శివలింగం పాల్గొన్నారు.

కృష్ణా పుష్కరాలకు సకల సన్నాహాలు

పుష్కర విధుల్లో 16వేల మంది సిబ్బంది * కోటిన్నర భక్తుల రాకపై అంచనా
కలెక్టర్ సత్యనారాయణరెడ్డి వెల్లడి

నల్లగొండ, జూలై 30: జిల్లాలో ఆగస్టు 12నుండి 23వరకు జరిగే కృష్ణా పుష్కరాల నిర్వాహణకు జిల్లా యంత్రాంగం సకల సన్నాహాలు చేపట్టిందని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి, జెసి ఎన్. సత్యనారాయణ, ఎజెసి వెంకట్రావు, డిఆర్‌వో రవికుమార్‌లతో కలిసి పుష్కర ఏర్పాట్ల పనులను వివరించారు.
జిల్లాలో కృష్ణా పుష్కరాల కోసం గతంలో 11ఘాట్‌లు ఉండగా 43లక్షల భక్తులు వచ్చారని ఈ దఫా తెలంగాణలో రెండు జిల్లాలు మహబూబ్‌నగర్, నల్లగొండలలో మాత్రమే కృష్ణా పుష్కరాలు జరుగుతున్నందునా కోటిన్నర మంది వరకు భక్తులు రావచ్చన్న అంచనాలతో 28ఘాట్‌లు ఏర్పాటు చేశామన్నారు. పుష్కర ఘాట్‌ల పనులు, వసతుల పర్యవేక్షణకు 7గురు నోడల్ అధికారులను నియమించామని, ప్రతి ఘాట్‌కు 28మంది ఇన్‌చార్జి అధికారులను నియమించామన్నారు.
వారితో పాటు 11శాఖలకు సంబందించిన అధికారులు, సిబ్బంది మూడు షిఫ్ట్‌లలో విధులు నిర్వహిస్తారన్నారు. ప్రతి ఘాట్ వద్ధ కంట్రోల్ రూమ్, వాచ్‌టవర్స్, వాటికి ఇన్‌చార్జి అధికారులను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ప్రతి ఘాట్ వద్ధ షిఫ్ట్‌కు ఐదుగురు చొప్పున గజ ఈతగాళ్లను, బోట్‌లను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల రద్ధీ ఎక్కువగా ఉండే వాడపల్లి, మఠంపల్లి, సాగర్ ఘాట్‌లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
పుష్కర ఘాట్‌లకు వచ్చివెళ్లే దారులకు ట్రాఫిక్ నియంత్రించేందుకు 30పార్కింగ్ పాయింట్లను, 675ఎకరాల్లో, 29హోల్డింగ్ పాయింట్లను 753ఎకరాల్లో ఏర్పాటు చేశామన్నారు.. అక్కడి నుండి ఘాట్‌ల వరకు ఆర్టీసి బస్సుల్లో వెళ్లాల్సివుంటుందన్నారు. పుష్కర ఘాట్‌ల వద్ధ, పార్కింగ్, హోల్డింగ్ స్థలాల వద్ధ మంచినీరు, పారిశుద్ధ్యంకు పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంధి విధులు నిర్వహిస్తారన్నారు. 1900టాయిలెట్స్ ఏర్పాటు చేశామన్నారు. వైద్య సేవల కోసం వైద్య ఆరోగ్య శాఖ వైద్యులు, సిబ్బంది పనిచేస్తారన్నారు. వికలాంగుల కోసం వీల్‌చైర్స్ సమకూర్చుతామని, వాడపల్లి,మఠంపల్లి, సాగర్‌లలో మీడియా పాయింట్లు ఏర్పాటు చేస్తామన్నారు. 8,750మంది ప్రభుత్వ యంత్రాంగం సిబ్బందితో పాటు ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు ఘాట్‌ల వద్ధ, పార్కింగ్, హోల్డింగ్ పాయింట్ల వద్ధ ప్రజలకు సేవలందిస్తారన్నారు. సత్యసాయి వాలంటీర్లు దేవాలయల వద్ధ భక్తుల రద్ధీని నియంత్రిస్తారన్నారు. శాఖల వారిగా ప్రభుత్వ సిబ్బందికి వివిధ రంగుల డ్రెస్‌కోడ్‌ను అమలు చేస్తున్నామన్నారు. పుష్కర సమాచారం కోసం ఈ నెల 1న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డిలతో ప్రత్యేక యాప్ ప్రారంభిస్తామన్నారు. పుష్కరాల సమాచారం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ప్రారంభిస్తామన్నారు. ఘాట్ వద్ధ సిబ్బందికి వాకిటాకీలు, భక్తుల కోసం ఏటిఎంలు ఏర్పాటు చేస్తారన్నారు.
ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతు జిల్లాలో కృష్ణా పుష్కరాల బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు 6,755మంది జిల్లా పోలీసులు, 4,300మంది మెదక్, వరంగల్, సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్, ఖమ్మం జిల్లాల పోలీసులు విధులు నిర్వహిస్తారన్నారు. వారికి తోడుగా ఎన్‌సిసి, ఎస్‌ఎస్‌ఎస్, స్వచ్చంద సంస్థల వాలంటీర్లు 2098మంది పుష్కర భక్తుల సేవల్లో భాగస్వామ్యమవుతారన్నారు.
ఎంపి, ఎమ్మెల్యేల నిధులు 50లక్షలు వెచ్చించి 180సిసి కెమెరాలను ఘాట్‌లు, పార్కింగ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామని పుష్కరాలు పూర్తయ్యాక వాటిని ముఖ్య పట్టణాల్లో అమర్చుతామన్నారు. జిల్లాకు పుష్కరాల సందర్భంగా వచ్చి వెలుతున్న వాహనాల సంఖ్యను, భక్తుల సంఖ్యను లెక్కించేందుకు రామన్నపేట, పంతంగి, తిరుమలగిరి, చిలకల్లు, మోతె, మాల్, సాగర్, మాడ్గులపల్లి టోల్‌ఫ్లాజాల వద్ధ తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గంటగంటకు భక్తుల సంఖ్య తెలుస్తుందన్నారు. ప్రధానంగా సాగర్-మాచర్ల రోడ్డును పుష్కరాల సందర్భంగా మూసివేస్తు ట్రాఫిక్‌ను గుర్రంపోడు, నల్లగొండ మీదుగా అద్దంకి-నార్కట్‌పల్లి రోడ్డుకు డైవర్షన్ చేస్తున్నామన్నారు. పుష్కర కంట్రోల్ రూమ్‌ను 9490619446నెంబర్‌తో ఏర్పాటు చేశామన్నారు. డాగ్‌స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్, క్లూసీటీమ్స్, ఆయుధాలతో ఉండే క్విక్ రియాక్షన్స్ టీమ్స్‌ను బందోబస్తులో ప్రత్యేకంగా ఉంటాయన్నారు.

ఎంసెట్ లీక్‌పై భగ్గుమన్న ఎబివిపి

కలెక్టరేట్ ముట్టడిలో ఉద్రిక్తత

నల్లగొండ, జూలై 30: ఎంసెట్-2లీకేజీపై ఎబివిపి విద్యార్ధి సంఘం శనివారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకవెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలువరించిన సందర్భంలో ఇరువర్గాల మధ్య తోపులాట సాగింది. ఎంసెట్ లీకేజీకి ప్రభుత్వం బాధ్యత తీసుకుని మంత్రులను బర్తరఫ్ చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తు ఎబివిపి విద్యార్థులు కలెక్టరేట్ గేట్ బారికేడ్లను, రక్షణ కంచెను దాటి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించే క్రమంలో పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసులు లాఠిచార్జీ చేసి విద్యార్థులను చెదురగొట్టారు. నిరసనగా విద్యార్థులు అటుగా వెలుతున్న ఆర్టీసి బస్సుపై రాళ్లు రువ్వడంతో అద్దాలు పగిలాయి. పోలీసులు విద్యార్థులను వెంబడించి మరి లాఠీచార్జి చేసి వారిలో 20మందికి పైగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఎబివిపి జిల్లా కన్వీనర్ రమేష్ మాట్లాడుతు తాము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు లాఠీచార్జి చేసి అరెస్టు చేశారన్నారు. ఎంసెట్ లీకేజిపై సీఎం కెసిఆర్ మంత్రులు కడియం, లక్ష్మారెడ్డిలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు లింగస్వామి, మహంకాళిశివ, వంశీ, విష్ణు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఎబివిపి విద్యాసంస్థల బంద్ విజయవంతం
వలిగొండ : ఎంసెట్ రద్దు వద్దంటూ ఎబివిపి ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ శనివారం నాడు మండల కేంద్రంలో విజయవంతమైంది.

రాష్ట్రంలో అసమర్థ పాలన

* ఎంసెట్ మూడుసార్లు నిర్వహించడమే నిదర్శనం
* బిజెపి జిల్లా కార్యవర్గసమావేశంలో ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్

సూర్యాపేట, జూలై 30: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ అసమర్థ పాలన కొనసాగుతుందని, ఎంసెట్ ప్రవేశపరీక్షను మూడుసార్లు నిర్వహించడమే ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని బిజెపి శాసనసభ్యుడు ఎన్‌విఎస్‌ఎస్.ప్రభాకర్ విమర్శించారు. శనివారం పట్టణంలోని జివివి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన బిజెపి జిల్లా కార్యవర్గసమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హజరై ప్రసంగించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను అమలుచేయడంలో ప్రభుత్వం ఘెరంగా విఫలమైందన్నారు. సిఎం కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తు ప్రజాస్వామ్య విలువలను తగ్గించేలా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఎంసెట్-2ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని, వైద్యఆరోగ్యశాఖ మంత్రికి చెందిన విద్యార్ధులకు మంచిర్యాంకులు వచ్చాయని, అందువల్ల తక్షణమే వైద్యఆరోగ్యమంత్రి లక్ష్మారెడ్డిని భర్తరఫ్ చేయడంతో పాటు ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. రాష్ట్ర క్యాబినెట్‌లో పనిచేస్తున్న సగానికి పైగా మంత్రులు అసమర్ధలేనన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు అడ్డగా చేసుకొని ఆశ్రయం పొందుతున్నా పక్కా రాష్ట్రాల పోలీసులు వచ్చి వారిని పట్టుకునేంత వరకు ఇక్కడ వారు స్పందించడం లేదని, అసలు హోంమంత్రి ఏం పనిచేస్తున్నారని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సహకరిస్తూ భారీగా నిథులు కేటాయిస్తుందన్నారు. కేంద్రం ఇస్తున్న నిథులను కనీసం ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ప్రధానమంత్రి మోదీ వచ్చేనెల 7న రాష్ట్రంలో పర్యటించనున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన మోదీతో మహాసమ్మేళనం కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో తెలంగాణకు కేంద్రం ద్వారా అందిస్తున్న నిధులను గూర్చి వివరించడం జరుగుతుందన్నారు. పార్టీని గ్రామస్ధాయినుండి బలోపేతం చేసుకొని కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి 2019ఎన్నికల్లో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కార్యకర్తలు,నాయకులు శ్రమించాలని కోరారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోదీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని, 7న జరిగే మోదీతో మహాసమ్మేళనం కార్యక్రమానికి జిల్లా నుండి 10వేల మందిని తరలించనున్నట్లు తెలిపారు. బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు వీరేల్లి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఇంచార్జీ, నెహ్రూ యువకేంద్రం జాతీయ వైస్ చైర్మన్ పేరాల చంద్రశేఖర్, బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి చింతా సాంబమూర్తి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ మనోహర్‌రెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఓరుగంటి రాములు, దాసరి మల్లేశం, నూనె సులోచన, శ్రీరామోజు షణ్ముక, గోలి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

రాజయ్యకో న్యాయం ...
కడియం, లక్ష్మారెడ్డిలకు మరో న్యాయమా?
భువనగిరి, జూలై 30: రాజయ్యను మంత్రివర్గంనుండి తప్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఎమ్సెట్ 2 రద్దుకు కారణమైన విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిలను ఎందుకు ఉపేక్షిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజక ఇంచార్జి కుంభం అనీల్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
శనివారం స్థానిక సంకల్ప్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ భువనగిరి మండల స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా అనీల్ కుమార్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ హాయంలో ప్రారంభించిన ప్రాజెక్టుల డిజైన్లు మార్చి కొత్తపేర్లుపెట్టి ప్రజలను మోసం చేస్తున్నదని అన్నారు. సాగునీటి అవసరాలను మెరకు ప్రాజెక్టులను నిర్మించాలని ఆయన ప్రభుత్వానికి హితవుపలికారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలోబాగంగా బస్వాపురం రిజర్వాయర్‌లో భూములు, ఇళ్లు కోల్పొతున్న భూనిర్వాసితులకు న్యాయం జరిగె వరకు వారికి అండగా నిలుస్తామాన్నారు.
టిఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విదానాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజాసమస్యల పరిష్కారం కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో చేపట్టె ఆందోళనలో నాయకులందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భువనగిరి నియోజకవర్గ స్థాయిలో నాయకులందరి సహకారంతో పార్టీని బలోపేతానికి కృషిచేస్తానని, నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు.
ఈ సమావేశంలో పిసిసి మాజి కార్యదర్శి తంగళ్లపల్లి రవికుమార్, నాయకులు ఏనుగు ధర్మారెడ్డి, దొనకొండ రాములు, రావుల నందు, కోటపెద్దస్వామి, మచ్చ నర్సింహ్మ, ఎడమ బాలక్రిష్ణ, వలిగొండ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, గుమిడెల్లి రమేశ్, బెండ శ్రీకాంత్, చిక్కుల వెంకటేశం, రావి వేణుగోపాల్‌రెడ్డి, పుమార్ సత్యనారాయణ, రావుల రాజు తదితరులు పాల్గొన్నారు