నల్గొండ

కదం తొక్కిన కమలదళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, ఆగస్టు 4: బిజెపి జిల్లా శ్రేణులు గురువారం జిల్లా కేంద్రంలో భారీ మోటార్ సైకిల్, కార్ల ర్యాలీ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు స్వాగతం పలుకుతు జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొని పట్టణ వీధులగుండా ప్రదర్శనగా సాగారు. బిజెపి జిల్లా పార్టీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్‌రావు జిల్లా పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పార్టీ కార్యాలయం నుండి ఈ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నూతన కార్యాలయం భవనం వద్ధ మొక్కలు నాటారు. అనంతరం ప్రారంభమైన ర్యాలీలో డాక్టర్ లక్ష్మణ్, సంకినేనిలు పాల్గొని ప్రజలకు అభివాదం చేస్తు సాగారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతు జిల్లాలో బిజెపి బలోపేతం దిశగా వేగంగా దూసుకుపోతుందన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ పాలన విజయాలు, సంక్షేమ పథకాల ప్రచారాలతో బిజెపి శ్రేణులు పల్లెపల్లెకు బిజెపి, ఇంటింటి మోదీ పథకాలు కార్యక్రమాలతో ముందుకు సాగాలన్నారు. సంకినేని జిల్లా బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం జిల్లా రాజకీయాల్లో మైలురాయి వంటిదన్నారు. ఆమిత్‌షా బహిరంగ సభను సూర్యాపేటలో విజయవంతంగా నిర్వహించి తెలంగాణలో బిజెపి 2019అధికారంలో వచ్చేందుకు తొలి అడుగును విజయవంతంగా వేయించిన ఘనత సంకినేనిదన్నారు. అధికార టిఆర్‌ఎస్ పాలన వైఫల్యాలను ఎండగట్టేందుకు సంకినేని నాయకత్వంలో బిజెపి శ్రేణులు కదం తొక్కాలన్నారు. పార్టీ నూతన అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతు టిఆర్‌ఎస్ పాలనాలో జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో సమస్యలు ఎదుర్కోంటున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటులో నిర్ణయాత్మకశక్తిగా భూమిక పోషించిన బిజెపి రాష్ట్ర అభివృద్ధికి టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో సైతం కీలకంగా వ్యవహరించాల్సివుందన్నారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం దళితలకు మూడెకరాల భూ పంపిణీగాని, డబుల్ బెడ్‌రూమ్, డిఎస్సీ, ఉద్యోగ రిక్రూట్‌మెంట్, ఫీజురీఎంబర్స్‌మెంట్, రైతు రుణమాఫీ, పెండింగ్ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తు రాష్ట్ర ఏర్పాటుపై ఆయ వర్గాల ప్రజలు పెట్టుకున్న ఆశలు నీరుగారుస్తుందన్నారు. వామపక్షాలతో జిల్లాకు ఎంతో చరిత్ర ఉందని, మంత్రులుగా జానారెడ్డి, మాధవరెడ్డిలు జిల్లా అభివృద్ధికి ఎంతో చేశారని, జగదీష్‌రెడ్డి మాత్రం ఎలాంటి మేలు చేయడం లేదన్నారు. తొమ్మిది గంటల కరెంట్‌ను రైతులు వినియోగించుకోవాలంటే ప్రాజెక్టులు పూర్తి చేసి చెరువులు, కాలువలు నింపాలన్నారు.
జిల్లా ప్రగతికి, జిల్లా పటిష్టతకు బిజెపి అధ్యక్షుడిగా చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులు పేరాల చంద్రశేఖర్, ప్రేమ్‌రాజ్, వీరేల్లి చంద్రశేఖర్, చింతా సాంబమూర్తి, గోలి మధుసూధన్‌రెడ్డి, భాగ్యారెడ్డి, కె.శ్రీ్ధర్‌రెడ్డి, పాదూరి కరుణ, శ్యాసుందర్, కాసం వెంకటేశ్వరు, జి.మనోహర్‌రెడ్డి, షణ్ముక, పోతెపాక సాంబయ్య, బాకి పాపయ్య, కె.శ్రీనివాస్‌రెడ్డి, పి.మునికుమార్, బండారు ప్రసాద్, మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, బోజ్జ నాగారాజు పాల్గొన్నారు.