నల్గొండ

పుష్కరఘాట్లను పరిశీలించిన గుత్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, ఆగస్టు 6 : కృష్ణ పుష్కరాలు సమీపిస్తుండటంతో శనివారం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పానగల్‌లోని ఛాయా సోమేశ్వర ఆలయం వద్ద నిర్మాణంలో ఉన్న పుష్కరఘాట్ల పనులను వాటి తీరుతెన్నులను టి ఆర్ ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ దుబ్బాక నర్సింహ్మారెడ్డితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా పుష్కర అభివృద్ధి పనుల గురించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అనంతరెడ్డి, పుల్లెంల వెంకటనారాయణగౌడ్, అబ్బగోని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

చెర్వుగట్టు అభివృద్ధికి సహకారం
ఎంపి కవితకు వినతి
నార్కట్‌పల్లి, ఆగస్టు 6: తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితను శనివారం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం సహాయ కమిషనర్, ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, ఆలయ సిబ్బంది, అర్చక బృందం నల్లగొండలో జాగృతి ప్రతినిధుల సభలో కలిసి దేవస్థానం అభివృద్ధి కోరుతు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కవితకు చెర్వుగట్టు దేవస్తానం జ్ఞాపికను అందించిన మనోహర్‌రెడ్డి ఆమెను శాలువతో సత్కరించారు. దేవస్థానం సందర్శనకు ఆమెను ఆహ్వానించారు. చెర్వుగట్టు క్షేత్ర విశేషాల పుస్తకాన్ని ఆమెకు అందించి క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం నుండి సహకరం అందించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు రామలింగేశ్వరశర్మ, సీనియర్ అసిస్టెంట్ రామారావులు, దేవాలయ సిబ్బంది ఉన్నారు.
ఘనంగా జయశంకర్ జయంతి
సూర్యాపేట, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో ప్రొపెసర్ జయశంకర్ పాత్ర మరువలేనిదని రాష్ట్ర విద్యుత్, ఎస్సి అభివృద్ది శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రొపెసర్ జయశంకర్ 82వ జయంతి వేడుకలను శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో, సాయిత్రివేణి కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు హాజరైన ఆయన జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ వైతాలికుడు ప్రొ॥ జయశంకర్ అన్నారు. తెలంగాణ తొలిదశ ఉద్యమం నుండి మలిదశ ఉద్యమం వరకు ఆయన పాత్ర కీలకమైందన్నారు. తెలంగాణే శ్వాసగా భావించి బ్రహ్మచారిగానే ఉంటూ తుదిశ్వాస విడిచే వరకు తెలంగాణ కోసం పరితపించిన మహానీయుడన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ నేరేళ్ల లక్ష్మి, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, నాయకులు వెంకటేశ్వర్లు, ఆకుల లవకుశ, నేరేళ్ల మధు, తదితరులు పాల్గొన్నారు.

తాంగ్-టా అంతర్జాతీయ క్రీడలకు
మిర్యాలగూడ విద్యార్థులు
మిర్యాలగూడ, ఆగస్టు 6: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని ఆర్డీఓ కిషన్‌రావు అన్నారు. జూలై 29నుండి ఆగస్టు 2వరకు తాంగ్-టా ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి తాంగ్-టా ఆటలో ప్రతిభ కనబరిచి నవంబర్‌లో భూటాన్ దేశంలో జరగబోయే అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు ఎంపికైన ఆదిత్య పాఠశాల విద్యార్థులను శనివారం ఆర్డీఓ కార్యాలయంలో అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి పట్టణ, జిల్లా, రాష్ట్ర, దేశానికి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. సయ్యద్‌ఫారూక్ స్వర్ణ పతకం, దేవిరెడ్డి హాసిన్, తంగెళ్ల కీర్తిరెడ్డిలు రజత పతకాలు, వంగాల రాజశేఖర్‌రెడ్డి, గడ్డం రణవీర్, బొమ్మకంటి ప్రశాంత్, గున్‌రెడ్డి మనోహర్‌లు కాంస్య పతకాలు సాధించారు. కార్యక్రమంలో తహశీల్దార్ కృష్ణారెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ అమరేందర్‌రెడ్డి, డైరెక్టర్ సైదిరెడ్డి, ప్రిన్సిపాల్స్ వెంకటరామయ్య, రంగమణి, పిఇటి కర్నాకర్ పాల్గొన్నారు.
మొక్కలు నాటిన జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు
దేవరకొండ, ఆగస్టు 6: హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం మండలం లోని కొండభీమనపల్లి, బొడ్డుపల్లి గ్రామాల్లో జిల్లా పరిషత్‌చైర్మెన్ నేనావత్ బాలూనాయక్, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరిత తెలంగాణలో ప్రతి ఒక్కరు తమ వంతు పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు. దేవరకొండ నియోజకవర్గంలో వర్షాలు ఆశాజనకంగా లేనందున హరితహారంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదని వర్షాలు పడిన వెంటనే మొక్కలు నాటే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు వెంకటయ్య, ప్రభాకర్‌రావు, ఎంపిపి మేకల శ్రీనివాస్‌యాదవ్, ఎపీడివో విజయలక్ష్మి, తహశీల్దార్ గణేశ్, నాయకులు మారుపాకుల సురేశ్‌గౌడ్, ఎం ఎ సిరాజ్‌ఖాన్, హన్మంతు వెంకటేశ్‌గౌడ్, శిరందాసు కృష్ణయ్య, టివి ఎన్ రెడ్డి, బొడ్డుపల్లి కృష్ణ, కొర్ర రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయంలో జయశంకర్ జయంతి
నల్లగొండ టౌన్, ఆగస్టు 6: తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌కు గ్రంథాలయంలో జరిగిన ఆయన 82వ జయంతి కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి, సిబ్బంది ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమ దివిటి, తెలంగాణ ప్రగతి మార్గదర్శియైన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధనకు ప్రజలంతా సీఎం సారధ్యంలో బంగారు తెలంగాణ దిశగా ముందడుగు వేయాలన్నారు. కార్యక్రమంలో సహాయ గ్రంథపాలకుడు కట్ట నాగయ్య, సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వర్‌రావు, శ్రవణ్‌కుమార్, నిర్మలదేవి, నర్సయ్య, శారద, అనిత తదితరులు పాల్గొన్నారు.