నల్గొండ

మహా ఒప్పందం చారిత్రాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఆగస్టు 21: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈనెల 28న మహారాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసేకునే రోజు తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మకంగా నిలుస్తుందని, సోమవారం సూర్యాపేట జిల్లా ప్రకటన ఈ ప్రాంత ప్రజలకు తీపికబురుగా నిలుస్తుందని రాష్ట్ర విద్యుత్, దళిత సంక్షేమ శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజవకర్గంలోని టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట ప్రాంతానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందుతాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వందలకోట్లు ఖర్చు అయిన నేటి వరకు శ్రీరాంసాగర్ రెండవ దశ చివరి ఆయకట్టు వరకు నీరందని దుస్థితి నెలకొందన్నారు. ముందు చూపు లేకుండా కోట్లాది రూపాయాలు ఖర్చుచేసి కాల్వలు నిర్మించిన నీరు రాలేదని భవిష్యత్‌లో కూడా వచ్చే అవకాశం లేనందున ముఖ్యమంత్రి కెసి ఆర్ గోదావరి జలాల వినియోగంపై అధ్యాయనం చేసి చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టును రీడిజైన్ చేయడం వల్ల శ్రీరాంసాగర్ రెండవదశకు గోదావరి జలాలు రానున్నాయన్నారు. డిసెంబర్ 2017నాటికి రెండవదశ కాల్వలకు నీరు వస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాలోని 2.20లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. గతంలో ప్రతి ఏడాది నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే వారని గత కొనే్నళ్లుగా నీరు విడుదల చేయలేని పరిస్థితి నెలకొందని ఇందుకు ఎగువ ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాలు ఇష్టానుసారంగా ప్రాజెక్టులు నిర్మించుకోవడమే కారణమన్నారు. అందువల్ల భవిష్యత్‌లో తలెత్తే నీటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని గోదావరి జలాలను వినయోగించుకునేలా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. గత ఎన్నికలకు ముందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు సూర్యాపేటను జిల్లాగా ఏర్పాటుచేయడం జరుగుతుందని, సోమవారం అధికారికంగా ప్రకటన వెలువడుతుందని చెప్పారు. జిల్లా ఏర్పాటు కానుండడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్దిపథంలో నిలుస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో సూర్యాపేట, మిర్యాలగూడ మున్సిపల్ చైర్‌పర్సన్‌లు గండూరి ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.