నల్గొండ

నేడు సార్వత్రిక సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 1: కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తు వామపక్షాలు, అనుబంధ కార్మిక, ఉద్యోగ, అసంఘటిత రంగ కార్మిక సంఘాలు నేడు శుక్రవారం సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నాయి. సమ్మెలో భాగంగా ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాలు, ట్రాన్స్‌పోర్టు లారీలు అన్న కూడా బంద్ పాటించనుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించే పరిస్థితులున్నాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, బ్యాంకులు, టెలికాం సంస్థల ఉద్యోగులు, కార్మికులంతా సమ్మెలో పాల్గొననున్నారు. సమ్మెకు మద్దతుగా విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తు వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నట్లుగా ఈ మేరకు ఇప్పటికే సమ్మె నోటీస్‌లు సైతం ఇచ్చినట్లుగా జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి తుమ్మలవీరారెడ్డి ప్రకటించారు. భవన నిర్మాణ రంగం కార్మికులు, హమాలీలు, పంచాయతీ, మున్సిపల్ వర్కర్లు, అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు, మధ్యాహ్నా భోజన కార్మికులు, ఇతర అసంఘటిత రంగాల కార్మికులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొంటారన్నారు. సమ్మె సందర్భంగా జిల్లా, మండల స్థాయిల్లో కార్మిక, ఉద్యోగ సంఘాలు బంద్ పాటించి ప్రదర్శనలు, ధర్నాలు, మోటార్ సైకిల్, సైకిల్ ర్యాలీలు, ఫ్యాక్టరీ గేట్ మీటింగ్‌లు, సదస్సులు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.