నల్గొండ

కోవర్టు రాజకీయాలు మానుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 3 : మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ ఇటు టి ఆర్ ఎస్‌లో ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోవర్టుగా మారాడా అన్న చందంగా ప్రవర్తిస్తూ ప్రజలకు తప్పుడు సమాచారం చేరే విధంగా వ్యవహరిస్తున్నాడని మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. శనివారం స్ధానిక టి ఆర్ ఎస్ బాధ్యులు దుబ్బాక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు, టి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు అబ్బగోని రమేష్‌తో కలసి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్‌లో ఉన్న మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త తన భార్యతో కలసి టిఆర్‌ఎస్‌లో చేరి శుక్రవారం స్ధానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలసి హైకోర్టు వరకు వెళ్ళి ఆయనతో పార్టీలు, విందులు, వినోదాల్లో పాలు పంచుకోవడం తమకేమీ అభ్యంతరం లేదని పార్టీనీ వీడి అలాగే ప్రవర్తించవచ్చని సూచించారు. మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలు చేస్తూ అవి కప్పిపుచ్చుకోవడానికి పార్టీలో చేరి కౌన్సిలర్లపై గౌరవం లేకుండా వ్యవహరించడం సరికాదని, తామంతా అధిష్టానానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికీ మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలపై తమ వద్ద వీడియో సాక్ష్యాలు సైతం ఉన్నాయని, మంత్రి కే టి ఆర్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందిస్తామని హెచ్చరించారు. రెండున్నర సంవత్సరాల పాలనలో మున్సిపాలిటీనీ భ్రస్టు పట్టిస్తూ రాజకీయ వ్యభిచారం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. గత పది సంవత్సరాలుగా పట్టణ మున్సిపాలిటీ ఇంచార్జీ పరిపాలనలో కొనసాగుతుందని, మున్సిపాలిటీ అక్రమాలపై పత్రికల్లో ఎన్ని వార్తలు వచ్చినా చీమ కుట్టినట్లయినా లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రవర్తనను తామంతా రాజకీయ వ్యభిచారంగా అభివర్ణిస్తున్నామని, ఎప్పటికైనా జోడు గుర్రాల సవారీ ప్రమాదకరమని గమనించాలన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, దుబ్బ అశోక్‌సుందర్, ఖయ్యుంబేగ్, ప్రదీప్‌నాయక్, దండంపల్లి సత్తయ్య, నాయకులు కవితవేణుగోపాల్, అంతటి జ్యోతిసమాధానం, హారికఅశోక్, బొంత శ్రీను, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

దయచూపని వరుణుడు
తుంగతుర్తి, సెప్టెంబర్ 3: జిల్లాలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండి పొంగి పొర్లుతు కళకళలాడుతుండగా మండలంలో మాత్రం చెరువులు, కుంటలు నీరులేక వెలవెలబోతున్నాయి. పెట్టిన వరినాట్లలో చుక్కనీరులేక బీటలు వారుతున్నాయి. కేవలం చిరుజల్లులే కురుస్తుండటంతోనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. మండలపరిధిలోని తుంగతుర్తిలో రెండు పెద్ద చెరువులు ఉండగా తూర్పుగూడెం, గానుగుబండ, గుమ్మడవెల్లి, అన్నారం, సంగెం, వెంపటి, రావులపల్లి, గొట్టిపర్తి, పస్నూరు, పస్తాల తదితర గ్రామాలలోని కనీసం నాలుగవవంతు నీరు కూడా రాలేదంటే వర్షాల లేమి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పెద్దచెరువుల సంగతి అలా ఉంచితే చిన్న కుంటలే ఇంత వరకు నిండకపోవడం గమనార్హం. ఒకపక్క జిల్లాలో, రాష్ట్రంలో వరుణుడు భారీ వర్షాలతో అల్లకల్లోలం చేస్తుండగా మండలానికి మాత్రం వరుణుడి కరుణ ఇంకా నేటికి లభించలేదు. పడిన జల్లులకు రెట్టింపు ఎండ వేసవిని తలపిస్తోంది. ప్రస్తుతం కురిసిన వర్షాలు కంది, పత్తి పంటలకు కొంత ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. వర్షాల లేమి పెసర పంటపై తీవ్ర ప్రభావం చూపింది.
పూత, పిందె దశలో సుమారు నెలరోజులు వర్షపు చుక్క కురియక పోవడం పెసర పంట తీవ్రం నష్టం కలిగించింది. పత్తిపంట పూత వచ్చే దశలో వర్షాలు లేక చెట్లు అంతగా పెరగలేదు. ప్రస్తుతం కురిసిన జల్లులే పత్తికి జీవ గంజిలా మారాయి. వరి పంట ఎలాగూ పోయింది. ఉన్న పత్తి, కంది పండుతాయో లేదోననే ఆందోళన రైతులు వ్యక్తం చేస్తున్నారు. మండలంలో నీరులేక వెలవెలబోతున్న చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నింపి రెండో పంటకు నీరందించాలని రైతులు కోరుతున్నారు. తద్వారా బావులు, బోర్లల్లో నీటిశాతం పెరిగి అటుసాగు, ఇటు తాగునీటి కొరత పెరుగుతుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈప్రాంతంలో పనులు దొరకక వరినాట్ల కోసం నిజామాబాద్,కరీంనగర్ ప్రాంతాలకు కూలీలు వలసలు వెళ్లిన తీరు కరువు పరిస్థితులను కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు ఇకనైనా మండల పరిస్థితిని పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
సాగర్‌లో చోరీ
నాగార్జునసాగర్, సెప్టెంబర్ 3: నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వృద్ధదంపతులను బెదిరించి ఇంట్లో చొరబడి చోరికి పాల్పడ్డారు. ఎస్‌ఐ రజనీకర్ తెలిపిన వివరాల ప్రకారం నాగార్జునసాగర్ పైలాన్ కాలనీకి చెందిన చక్రధర్‌రాజు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత రాజు ఇంటికి ఇద్దరు అగంతకులు చేరుకోని పేరుపెట్టి పిలవడంతో తలుపులు తీశాడు. దీంతో లోపలికి చొరబడిన అగంతకులు కత్తులు చూపించి రాజు భార్య మెడలోని మంగళసూత్రం, నల్లపూసల తాడును లాక్కున్నాడు. దీంతో ఆగకుండా రాజును బెదిరించి బీరువాను తెరిచి రూ.5వేల నగదుతోపాటు వెండి సామాగ్రిని దోచుకోని వెళ్లిపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా శనివారం ఉదయం క్లూజ్ టీం, డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

కార్పొరేట్ విద్యాసంస్థలను
నిషేధించాలి: కోదండరామ్
కోదాడ, సెప్టెంబర్ 3: విద్యను వ్యాపారం చేస్తూ సమాజంలో అసమానతలను సృష్టిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలను తెలంగాణ రాష్ట్రంలో నిషేధించాలని తెలంగాణ జెఎసి చైర్మన్ ఆచార్య కోదండరామ్ డిమాండ్ చేశారు. కోదాడలో శనివారం ఎఐఎస్‌ఎఫ్ 81వ, వార్షికోత్సవం సందర్భంగా ‘విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలో పాలకులు అనుసరిస్తున్న నిర్యక్షం’పై నిర్వహించిన సదస్సుకు ఎఐఎస్‌ఎప జిల్లా అధ్యక్షులు చేపూరి కొండల్ అధ్యక్షత వహించగా ఆచార్య కోదండరామ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పేద, బడుగు, బలహీన, ధనిక వర్గాలందరికీ సమానమైన విద్యను అందించే విధానాన్ని ప్రభుత్వం తేవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ విద్యావ్యవస్థ్ధను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో వౌలిక సౌకర్యాలను కల్పించి ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఆయన కోరారు. జ్ఞానంతోనే సమాజంలో మార్పు సాధ్యమన్నారు. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు ఏర్పడినప్పుడే అన్నివర్గాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యాపరంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో వ్యత్యాసం కనపడుతున్నదని, ప్రైవేట్, ప్రభుత్వ విద్యావిధానం వేర్వేరుగా వుండటంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థ్ధులు హైస్కూల్ చదువును పూర్తిచేసిన పొందిన అరకొర విజ్ఞానంతో పోటీపడలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల చదువుకు పది శాతం మంది చేరడం దీనికి నిదర్శమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబోధనతోపాటు నైపుణ్యాలను పెంచాలని తద్వారానే అభివృద్ధి, ఉపాధి సాధ్యమన్నారు. నేర్పిన చదువును ఉపయోగించుకొనే నైపుణ్యాలను విద్యార్థులకు ఉపాధ్యాయులు నేర్పించాలని ఆయన సూచించారు. విద్యార్థులు నేటి ప్రపంచంలో శాస్ర్తియ ధృక్పథాన్ని అలవర్చుకొని సృజనాత్మకతను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ప్రత్యామ్నాయ విద్యను ప్రభుత్వం రూపొందించాలని ఆయన సూచించారు. సమాజ మార్పు కొరకు సమష్ట్టిగా ప్రయత్నిద్దామని ఆచార్య కోదండరామ్ చెప్పారు. సదస్సుకు తొలుత సమాఖ్య పతాకాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి బరిగెల వెంకటేశ్ ఆవిష్కరించగా ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు మేకల శ్రీనివాసరావు, టిజెఎసి జిల్లా కన్వీనర్ కుంట్ల ధర్మార్జున్, కోదాడ టిజెఎసి నాయకులు రాయపూడి చిన్ని, పందిరి నాగిరెడ్డి, బొల్లు ప్రసాద్, సమాఖ్య నాయకులు పరంగి రాము, కొండూరి వెంకటేశ్, ఆరికంటి జగన్, తమ్మనబోయిన నరేష్, జియాలుద్దీన్, ఉపేందర్, నాగుల్‌మీరా, ప్రవీణ్, సతీష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.