నల్గొండ

ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 6: జిల్లా ప్రజలు వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. శివపార్వతుల ముద్దుల తనయ ఆదిదేవుడు విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా వాడవాడల రకరాల ఆకృతుల్లో కొలువుతీర్చిన గణపతి విగ్రహాల ప్రతిష్టాపనోత్సవాలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వినాయక చతుర్ధి సందర్భంగా ప్రజలు విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో కొలిచి తమ కార్యక్రమాల్లో విఘ్నాలు తొలగించి విజయవంతం చేయాలంటు వేడుకున్నారు. నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, దేవరకొండ, హుజుర్‌నగర్, నకిరేకల్, చౌటుప్పల్, నార్కట్‌పల్లి, మేళ్లచెర్వు, మఠంపల్లి, దామరచర్ల, హాలియా, తిరుమలగిరి, మోత్కూర్, వలిగొండ, చిట్యాల, ఆలేరు, యాదగిరిగుట్ట వంటి పట్టణాలతో పాటు మారుమూల గ్రామాల్లో వాడవాడల వినాయక నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యయి. యువజన సంఘాలు, భక్తమండలులు, కాలనీ సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించుకున్నారు. నవరాత్రి ఉత్సవ మండపాలను అందంగా ముస్తాబు చేసి వాటిలో రకరకాల పురాణ, ఇతిహాస గాథలను ప్రస్ఫూటించే రూపాల్లో రూపొందించిన వినాయక విగ్రహాలను, సినీ బాహుబలి వంటి వినాయక విగ్రహాలను సైతం ప్రతిష్టించారు. వినాయక మండపాల వద్ద మున్సిపాల్టీలు, పంచాయతీలు అవసరమైన వసతులు కల్పించాయి. పోలీస్ యంత్రాంగం వినాయక నవరాత్రి ఉత్సవ మండపాలు, ఉత్సవ నిర్సాహకుల వివరాలను నమోదు చేసి శాంతిభద్రతల పరిరక్షణ దిశగా శాఖపరమైన చర్యలు చేపట్టింది. నల్లగొండలో ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి, ఆర్డీవో వెంకటాచారిలు వినాయక ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దఫా గతంలో కంటే అధికంగా పర్యావరణ పరిరక్షణ దిశగా మట్టి విగ్రహాల వినియోగం పెరుగడం స్వాగతించదగ్గ మార్పుగా కనిపించింది.
నల్లగొండ రూరల్‌లో...
నల్లగొండ రూరల్: మండలంలోని ఆయా గ్రామాలలో సోమవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బుద్ధారంలో టిఆర్‌యస్ నేత దుబ్బాక నర్సింహ్మరెడ్డి పాల్గొని మట్టి గణపతి వద్ద పూజలు నిర్వహించారు.
డ్వాబ్‌లో వినాయక వేడుకలు
నల్లగొండ టౌన్: పట్టణంలోని ఆంధుల పాఠశాలలో వినాయక చవితి వేడుకల్లో ఆర్‌డిఆర్ వెంకటాచారి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంధుల పాఠశాల పూర్వ విద్యార్థులు, పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల కరపత్రాన్ని విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని, సంస్థ నిర్వాహణకు దాతలు తోడ్పడాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంస్ధ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు, మారం గోపాల్‌రెడ్డి, రామారావు, దామోదర్‌రావు, మోహన్‌రావు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
కొండాపురం గ్రామస్థుల రాస్తారోకో
ఆత్మకూర్( ఎం), సెప్టెంబర్ 6 : ఆత్మకూర్ ( ఎం) మండలంలో ఉన్న కొండాపూర్ గ్రామాన్ని మోట కొండూరు మండలంలో కలపడం పట్ల గ్రామస్తులంతా ఏకమై మేయిన్ రోడ్డుపై పెద్ద ఎత్తున మంగళవారం రాస్తారోకో నిర్వహించి వంటావార్పు నిర్వహించారు. కొండాపురంలో కలుపకపోతే ప్రాణత్యాగాలకైన సిద్ధంగా ఉన్నామని నినాదాలు చేశారు. పోలీసులు చొరవ తీసుకొని ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో 4 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని ఆత్మకూర్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండాపూర్‌ను 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోటకొండూర్‌లో కలపొద్దని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఉద్యోగస్తులకు, గ్రామస్తులకు వాగ్వాదం జరిగినా రాస్తారోకోలో గ్రామస్తులంతా ఏకమై వంటావార్పు చేసి రోడ్డుపైనే భోజనాలు చేశారు. తమ డిమాండ్‌ను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంటయ్య, ఎంపిటిసి హేమలతరాజు, ఉప సర్పంచ్ వెంకట్‌రెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామస్తులు, అఖిలపక్ష పార్టీల నాయకులు, మహిళా సంఘాల నాయకురాలు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

చేనేతకు పూర్వవైభవం రావాలి
భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 6 : పోచంపల్లి చేనేతలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఇండియన్ హ్యాండ్‌లూమ్ బోర్డు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వీవర్ సర్వీస్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ హిమజ్‌కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో చేనేత ఉత్పత్తులు, మార్కెటింగ్‌పై సార్క్ స్వచ్ఛంద సంస్ధ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఆన్‌లైన్ కొనుగోలు ద్వారా వ్యాపార అభివృద్ది జరుగుతుందని, దీంతో కార్మికులకు ఉపాధి కలుగుతుందన్నారు. ప్రభుత్వం ముద్ర రుణాల ద్వారా కార్మికులకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీవన ప్రమాణాలు ఆర్ధిక అభివృద్ది, ఆర్ధిక పరిస్థితులను పెంచుకునేందుకు కార్మికులు కృషి చేయాలని కోరారు. అమేజాన్ కంపెనీ, వీవర్స్, స్మార్ట్ కంపెనీలు మన ముందుకు వచ్చాయని ఉత్పత్తులను వినియోగదారులకు అందించేందుకు మనమందరం సహాకరించాలని కోరారు. వ్యాపార అభివృద్ది కోసం ఉత్పత్తిలో అమ్మకాలు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సార్క్ స్వచ్ఛంద సంస్ధ సీ ఇ ఒ భాస్కర్, వీవర్స్ సర్వీసు సెంటర్ టెక్నికల్ సూపరిండెంటెండ్ పి ఎస్ ఎన్.రెడ్డి, నాయకులు తడక వెంకటేశం, రమేష్, శ్రీనివాస్, భారత లవకుమార్, యాదగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.