నల్గొండ

ఎడతెరపిలేని వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 13 : జిల్లాలో అల్పపీడన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం కూడా జిల్లావ్యాప్తంగా 59 మండలాల్లో వర్షాల జోరు కొనసాగింది. సోమవారం రాత్రి నుండి మంగళవారం రోజంతా కూడా ఎడతెరపి లేని వర్షాలు కురవగా జిల్లావ్యాప్తంగా 33.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాజా వర్షాలతో చెరువులు, కుంటలు నిండి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జంట నగరాల్లో కురిసిన వర్షాలతో మూసీ నదికి వరద ఉధృతి పెరగడంతో కేతేపల్లి మూసీ ప్రాజెక్టు నిండుకుండగా మారగా 645 అడుగులకు గానూ 640.5 అడుగులకు నీటిమట్టం చేరింది. మూసి ఎడమకాల్వ పొంగి కుడకుడ గ్రామంలో బుడగజంగాల కాలనీ, వడ్డెర కాలనీలోకి వరదనీరు చేరింది. కేతేపల్లి, బొప్పారం గ్రామంలో ఇల్లుకూలి వృద్ధురాలు చిట్టిపాక రాములమ్మకు గాయాలయ్యాయి. మిర్యాలగూడ డివిజన్‌లో నేరేడుచర్ల, దిర్షిన్‌చర్ల, నిడమనూరు, త్రిపురారం చెరువులు, కుంటలు నిండి అలుగు పోశాయి. పులిచింతల ఎగువ ప్రాంతంలో వాగులతో పాటు మూసీ నది వరద ఉధృతితో ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగి 19.36 టి ఎంసిలకు చేరింది. 1 లక్ష 2 వేల క్యూసెక్యులు ఇన్‌ఫ్లో, 12,550 ఔట్‌ఫ్లోగా కొనసాగింది. జిల్లావ్యాప్తంగా వరుస వర్షాలతో ఇప్పటిదాక 4762 చెరువులు, కుంటలకు గానూ 337 చెరువులు, కుంటలు అలుగు పోశాయి. 423 చెరువులు పూర్తిగా నిండగా 674 చెరువులు 75శాతం వరకు నిండాయి. మరో 1312 చెరువులు సగం వరకు నీటిమట్టం చేరింది. ఈ వర్షాలతో రైతాంగం వ్యవసాయ పనుల్లో నిమగ్నమైంది.