నల్గొండ

విద్యార్థులకు కలెక్టర్ సత్యనారాయణరెడ్డి సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, మార్చి 28: విద్యార్థులు ప్రణాళికాబద్దంగా పూర్తి పరిపక్వతతో పోటీ పరీక్షలను అదిగమించి ఎంపిక కావాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి సూచించారు. సోమవారం ఎన్జీ కళాశాల ఆవరణలోగల పెంటయ్య వసతి గృహం నందు ఆంధ్రాబ్యాకు వారి కన్సల్ట్ రెస్పాన్స్‌బిలిటి ఆధ్వర్యంలో 2లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన శుద్దనీటి జలాల ప్లాంటును ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశం దక్కించుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి వివిధ పోటీ పరీక్షలకు సంసిద్దం కావడం కోరకు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి పెంటయ్య ఏర్పాటు చేసిన వసతి గృహం విద్యార్థులకు ఎంతో వెసులుబాటు, సౌకర్యంగా ఉంటుందన్నారు. ఇందులో ఎంతో మంది విద్యార్థులు చదువుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించారన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విషయ పరీజ్ఞానం ఉంటుందని, ఇంగ్లీష్‌పై పట్టులేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంగ్లీష్ వెయిటేజ్ మార్కులు తొలగించారన్నారు. ఉద్యోగ నియామక పరీక్షల్లో విఫలమైతే నిరాశ చెందాల్సిన అవసరం లేదని మల్లీ తిరిగి ప్రయత్నించాలన్నారు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అంతకు ముందు వసతి గృహంలోని అన్ని గదులను పరిశీలించి గ్రూప్-2, ఎస్‌ఐ పోటీ పరీక్షలకు సంసిద్దవౌతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్, కుర్చీలు పంపిణీ చేశారు. ఇంకా అవసరమైన సహాయానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎజెసి వెంకట్‌రావు, ఆంధ్రాబ్యాంక్ ఛీఫ్ జనరల్‌మేనేజర్ మూర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శ్రీ్ధర్, మున్సిపల్ కమీషనర్ అలివేలు మంగతయారు. మున్సిపల్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.