నల్గొండ

పంట రుణమాఫీ వివరాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 23: 2014-15 సంవత్సరం రైతుల పంటరుణమాఫీ వివరాలను తక్షణమే అందించాలని ఆడిట్ అధికారులను, బ్యాంకర్లను ఎజెసి ఎస్. వెంకట్రావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశంలో పంట రుణామాఫీ పురోగతిని సమీక్షించారు. జిల్లాలో 4లక్షల 95వేల మంది రైతులు పంట రుణమాఫీ పొంది ఉన్నారని, నిబంధనల మేరకు ఒక్కో కుటుంబానికి 1లక్ష రూపాయల రుణమాఫీ వర్తించనుందన్నారు. అయితే కొంత మంది ఒకే కుటుంబానికి చెందిన వారిలో ఇద్దరు ముగ్గురు కూడా పంట రుణాలు పొంది ఉన్నారన్నారు. బ్యాంకర్ల నుండి రుణాలు పొందిన రైతుల వివరాలను, బ్యాంకర్లు, ఆడిట్ అధికారులు వెంటనే నివేదికలు సమర్పించాలన్నారు. సెప్టెంబర్ 24నుండి పంట రుణాలు పొందిన రైతుల వివరాలను కంప్యూటర్‌లో డెటా ఏంట్రీ చేయనున్నామన్నారు. రుణమాఫీ వివరాలను ఇప్పటిదాకా 85శాతం అందించారని మిగతా వాటిని రేపటిలోగా పూర్తిగా అందించాలని, కలెక్టర్‌కు కూడా సదరు నివేదికలివ్వాలన్నారు. హాజరుకాని ఆడిట్ అధికారులకు మోమోలు జారీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంట రుణమాఫీపై అధికారులు జాగ్రత్తలు వహించి అధికారులు అవకతవకలు జరుగకుండా ప్రణాళిక బద్ధంగా నడుచుకుని రుణమాఫీ వివరాలు ఎప్పటికప్పుడు అందించాలన్నారు. ఈ నివేధికలు అందిన పిదపనే కొత్త పంట రుణమాఫీ అమలవుతుందన్నారు. ఈ సమావేశంలో జేడిఎ నరసింహరావు, ఏడి హరినాథ్‌బాబు, డిసివో ఆర్.లక్ష్మినారాయణ, పాండురంగారావు, లీడ్ బ్యాంకు మేనేజర్ సూర్యం తదితరులు పాల్గొన్నారు.