నల్గొండ

వర్ష బాధితులకు ప్రభుత్వ సహాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 23: జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో ఆస్తినష్టం, ప్రాణ నష్టం వాటిల్లిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగిన సహాయం అందిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి భరోసానిచ్చారు. శుక్రవారం రాత్రి ఆయన జిల్లా కేంద్రం నల్లగొండ పట్టణంలో వర్షాలు, వరదల తాకిడికి గురైన ప్రాంతాలను ఆయన సందర్శించి బాధితుల నుండి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు జిల్లాలో ఇప్పటిదాకా వర్షాలు, వరదలతో ఇల్లుకూలి ఒకరు, వరదలో కొట్టుకపోయి ముగ్గురు చనిపోయారన్నారు. వారి కుటుంబాలకు 4లక్షల చొప్పున రూపాయల ఆర్ధిక సహాయ అందిస్తామని ప్రకటించారు. ఇళ్లలోకి నీరు చేరి లేక ఇల్లుకూలిన వారికి, సామాగ్రి నష్టపోయిన వారికి తగిన ఆర్ధిక సహాయం అందిస్తామన్నారు. జిల్లాలో అకాల వర్షాలతో ఒకే రోజు 9సెంటిమీటర్ల వర్షం కురిసిందన్నారు. 34చెరువులు తెగిపోగా వెంటనే 24చెరువులను తాత్కాలిక మరమ్మతులు జరిపించామన్నారు. నల్లగొండ పట్టణంలో పానగల్ బైపాస్, మోతికుంట, విటి కాలని, పాతబస్తీ, ఎన్‌టిఆర్ నగర్‌లలో నాలాలు ఆక్రమించి, డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు జరుపడం వంటి చర్యలతో వరద నీరు కాలనీల్లోకి, ఇళ్లలోకి వరద నీరు చేరుతుందన్నారు. పట్టణం విస్తరిస్తున్న కొద్ధి సరైన లేఅవుట్లు లేకపోవడంతో వరద నీరు పారుదలకు తగిన మార్గాలు లేకుండా పోయాయన్నారు.