నల్గొండ

ముంపు బాధితులను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్రంపోడు, సెప్టెంబర్ 25: మండలంలోని తుర్కోనిభావి గ్రామంలోని ముంపు బాధితులను సి ఎల్పీ ఉపనేత, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి పరామర్శించారు. అనంతరం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తుర్కోనిభావి గ్రామంలోని 30 ఇండ్లు నీట మునిగాయని, ఆ కుటుంబాలకు అన్ని విధాలుగా న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామానికి పైన ఉన్న లక్ష్మీదేవిగూడెం చెరువు అలుగు పోయడం వల్ల నీరు ఇండ్లలోకి చేరిందని, గ్రామానికి చుట్టూ రక్షణ గోడ నిర్మించాలన్నారు. మూడు ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి గ్రామంలోని ప్రజలను అక్కడకు తరలించి డబుల్ బెడ్‌రూం ఇండ్లు ప్రభుత్వం కట్టించాలన్నారు. అతివృష్టి వల్ల రాష్ట్ర, జిల్లా రైతాంగం కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టపోయారని, వాటిని అధికారులు త్వరగా లెక్కలు గట్టి ప్రభుత్వానికి నివేదిక అందించాలన్నారు. పంట నష్టాన్ని వెంటనే రైతులకు అందించాలన్నారు. పంట రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయాలన్నారు. రబీకి అవసరమయ్యే రుణాలను సబ్సీడీ విత్తనాలను రైతులకు అందించాలన్నారు. అనంతరం బుడ్డారెడ్డిగూడెంలోని మాజీ సర్పంచ్ బొమ్ము శ్రీను తల్లి బొమ్ము కేతమ్మ మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించారు. పిట్టలగూడెం గ్రామంలోని మాజీ జెడ్పి చైర్మన్ మల్లారెడ్డి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వెంకటేశ్వరనగర్‌లో ఇటీవల మృతి చెందిన మాజీ సర్పంచ్ సిహెచ్.మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు జాల చిన్న సత్తయ్య, మండల తహశీల్ధార్ సైదులు, వ్యవసాయ అదికారి సందీప్, సింగిల్ విండో చైర్మన్ రాములు, కంచర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపిటిసి జాల ఇందిరా, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్‌రెడ్డి, అమరేందర్ పాల్గొన్నారు.