నల్గొండ

ప్రతి రైతుకు నష్టపరిహారం అందజేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 29: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందచేసి ప్రభుత్వం ఆదుకోవాలని సిఎల్‌పి నేత కుందూరు జానారెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం దిగువ భాగాన ఉన్న పెద్దవూర మండలంలోని కృష్ణపట్టెలో ఉన్న పలు గ్రామపంచాయతీలు, తండాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తునికినూతల, చింతలపాలెం, నెల్లికల్ గ్రామపంచాయతీల పరిధిలోని తండాలు, గ్రామాలలో భారీ వర్షాల కారణంగా పొలాలలో ఇసుకమేటలు వేసిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. దీంతోపాటు కొట్టుకుపోయిన రోడ్లు, కల్వర్టులు, తెగిన కుంటలు, చెరువులు, పంటపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులు తమను ఆదుకోవాలని జానారెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. కొన్నిచోట్ల వాహనాలు వెళ్లలేని పరిస్థితులలో ద్విచక్ర వాహనంపై వెళ్లి జానారెడ్డి సందర్శించారు. మరికొన్నిచోట్ల కాలినడకన సందర్శించారు. చెన్నాయిపాలెం, గోడుమడక, తిమ్మాయిపాలెం, నాయకునితండా, చింతలపాలెం, మొదలగు తండాలలో సుమారు 2 గంటల సేపు పర్యటించారు. ఈసందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో నష్టపోయిన ప్రాంతాన్ని పరిశీలించి నష్టాన్ని సరైన రీతిలో నమోదుచేయాలన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు కూడా న్యాయం జరిగేలా ప్రభుత్వానికి నివేదిక అందచేసి రైతులను ఆదుకోవాలన్నారు. గత 2, 3 సంవత్సరాలుగా వర్షాలు లేని కారణంగా పంటలు లేక పెట్టుబడి పెట్టిన రైతులు అప్పులపాలయ్యారని, ప్రస్తుతం అధిక వర్షాలతో మరింత అప్పులో కూరకుపోయారని తెలిపారు. తాను పరిశీలించినంతమేరకు సుమారు 1500 ఎకరాలలో పంటనష్టం జరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో ఒత్తిడితెస్తామని ఆయన తెలిపారు. ఆయన వెంట మండల అధ్యక్షులు కూరాకుల అంతయ్య, అబ్బిడి కృష్ణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, రాజారమేశ్‌యాదవ్, దినేష్‌నాయక్, ఇంద్రసేనారెడ్డి, భగవాన్‌నాయక్, కిషన్‌రావు, ఇంద్రకిరణ్ ఉన్నారు.