నల్గొండ

నరనరాన దేశభక్తిని జీర్ణించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, అక్టోబర్ 7: భారతీయులు ప్రపంచ దేశాలకు తమ దేశభక్తిని చాటేలా నరనరాన దేశభక్తిని జీర్ణించుకోవాలని ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ ప్రధాన వక్త దేవేందర్‌జీ సూచించారు. శుక్రవారం ప్రాధమిక శిక్షావర్గ రాష్టస్ధ్రాయి సార్వజనికోత్సవ సమావేశాన్ని పట్టణంలోని రాఘవేంద్ర బి ఈడి కళాశాలలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ముఖ్య పాల్గొని మాట్లాడుతూ దేశంలో జాతీయతత్వాన్ని ప్రతి ఒక్కరు చాటాలని, దేశద్రోహుల ఆటలు కట్టించాలని పిలుపునిచ్చారు. దేశసైన్యం పాకిస్తాన్ ఉగ్రమూకలకు బుద్ది చెప్పేందుకు నిర్వహించిన ఆర్మీ సర్జికల్ దాడులపై దేశంలోని నాయకులే సాక్ష్యాలు అడగడం సైనికులను అవమానించడమేనన్నారు. హిందూ తత్వాన్ని బలహీనపరిచేలా ఇతర మతాలు తమ జనబలంతో నిర్వీర్యం చేసే విధానాలు అవలంభిస్తున్నాయని, ప్రతి ఒక్కరు దేశమాతకు శిరస్సు వంచేలా సంఘటితం కావాలని కోరారు. దేశంలో బతుకుతూ ప్రభుత్వ పన్నులతో వసతిగృహాలలో చదివేవారు సైతం సైనికులను కించపరిచేలా చదువురాని పదవ తరగతి వారే సైనికుల్లో చేరుతున్నారనడం వారిని అవమానించడమేనని మండిపడ్డారు. రాత్రనక, పగలనక కుటుంబాలకు దూరమై దేశ రక్షణ కోసం పాటుపడే సైనికులను, అమరులైన సైనికులను కీర్తించాల్సింది పోయి వారిపై చులకనగా మాట్లాడటం ఆర్‌ఎస్‌ఎస్ పూర్తిగా ఖండిస్తుందన్నారు. 90 సంవత్సరాలుగా హిందూ సమాజ సంఘటన ఐఖ్యతకు కృషి చేస్తుందని, మాతృభూమి సేవలో తరలించేందుకు ప్రతి హిందువు జాతీయ విలువలతో, దేశభక్తితో నిర్మాణాత్మకం కావాలన్నారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల్లో పెద్ద ఎత్తున కవాత్ నిర్వహించి ఎన్జీ కళాశాల మైదానంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నాయకులు గార్లపాటి వెంకటయ్య, నన్నూరి రాంరెడ్డి, జిల్లా సంఘ్ చాలక్ ఇటికల వెంకటయ్య, సుధా బ్యాంకు మేనేజర్ మిట్టపల్లి సురేష్ పాల్గొన్నారు.