నల్గొండ

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెన్‌పహాడ్, అక్టోబర్ 16: ప్రజల ఆక్షాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతుందని రాష్ట్ర ఇంధన, దళిత అభివృద్ది శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలపరిధితోలని సింగారెడ్డిపాలెంలో నిర్మిస్తున్న రెండు పడకగదుల ఇండ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్దిలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేటతో పాటు జిల్లాలోని తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్‌లల్లో రెండు పడకగదుల ఇండ్ల నిర్మాణాలు త్వరలో ప్రారంభించడం జరుగుతుందన్నారు. అర్హులైన లభ్దిదారులకు ఇండ్లు కేటాయించడం జరుగుతుందన్నారు. జిల్లాను వ్యవసాయ అనుబంధ రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని జిల్లాను అభివృద్ది అగ్రపధాన నిలుపుతామన్నారు.