అక్షరాలోచన
నానీలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 6 August 2016
-తోట రామమోహన్ 9603897828
ఒక్కసారి
బ్యాటరీ తినిపిస్తే చాలు
చాకిరీ చేస్తుంది
గడియారం
* * *
గవ్వలే
చలామణిలో వుంటే
సముద్రాలను
బతకనిచ్చేవారా?
* * *
నీ ఒంటికి పూసిన
అత్తరు ఎక్కడిది?
గులాబీలు చిందించిన
రక్తమే!
* * *
ఎవరి ఆశ గొప్పది?
మబ్బుల్ని నమ్మి
పొలంలో విత్తే రైతుది!
కాదంటారా?
* * *
పాపాయిని
బోసి నవ్వులు నవ్వనీ
నోట్లో పాల పీకను
కుక్కకు సుమీ!
* * *
రేపన్నది లేదని
తెలిసినా
ఆ పువ్వులెంతగా
నవ్వుతాయో చూడు