నల్గొండ

పెండింగ్ ప్రాజెక్టులకు నిధులివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపి గుత్తా డిమాండ్
నల్లగొండ, మార్చి 8: తెలంగాణలో అసంపూర్తిగా ఉన్న సాగుతాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలని నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండలో మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.్భస్కర్‌రావుతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్‌ఎల్‌బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులు తుది దశకు చేరుకున్నాయన్నారు. ముందుగా వాటి పనుల పూర్తిని పట్టించుకోకుండా ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో, కొత్త ప్రాజెక్టుల పేరుతో కెసిఆర్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో సీఎం కెసిఆర్ గోదావరి ప్రాజెక్టుల నిర్మాణాలపై ఒప్పందాలు చేసుకునే ముందు ప్రాజెక్టుల వివరాలను రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు వివరించి అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సమంజసంగా లేదన్నారు. ప్రాణహిత-చేవేళ్ల పరిధిలోని మెదక్ జిల్లా ప్యాకేజీ పనులు చేపట్టి నల్లగొండ జిల్లా పరిధిలోని ప్యాకేజి పనులు నేటికి ప్రారంభించకపోవడం ప్రభుత్వ వివక్షతకు నిదర్శనమన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ను కూడా కేవలం మెదక్, సిరిసిల్లలను దృష్టిలో పెట్టుకునే చేస్తు సీఎం కెసిఆర్ తెలంగాణ మొత్తానికి సీఎం అన్న సంగతిని విస్మరిస్తున్నారంటు విమర్శించారు. నల్లగొండ జిల్లాలో తీవ్ర కరువుతో సాగు, తాగునీటికి ఇబ్బంది ఏర్పడిన నేపధ్యంలో సాగర్ ఎడమకాలువ, ఎఎమ్మార్పీ ఎత్తిపోతలకు నీటిని విడుదల చేసి తాగునీటి చెరువులు నింపి ప్రజలకు, పశువులకు తాగునీటి కొరత లేకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో రైలు, రోడ్డు మార్గాల విస్తరణకు ఇటీవల కేంద్రం మరిన్ని అనుమతులు ఇచ్చిందని గుత్తా వెల్లడించారు. కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం ఆమోదించి డిపిఆర్‌కు టెండర్లు పిలిచిందన్నారు. సూర్యాపేట-ఖమ్మం-అశ్వారావుపేట వరకు జాతీయ రహదారిగా ప్రకటించారన్నారు. సిరుమంచి-రేణిగుంట జాతీయ రహదారి నిర్మాణం మొదలైందని నల్లగొండ వద్ధ బైపాస్ నిర్మాణం ప్రస్తుతానికి లేదని తదుపరి డిపిఆర్‌లో ఆలోచన చేస్తామని కేంద్ర మంత్రి గడ్కారీ స్పష్టం చేశారన్నారు. రైల్వేల విస్తరణలో నల్లగొండ-మాచర్ల లైన్‌కు కొనసాగింపుకు చేసిన ఒత్తిడి ఫలించినా ఈ దఫా కేవలం 20లక్షలు మాత్రమే కేటాయించిందన్నారు. దీనితో పాటు జగ్గయ్యపేట-మేళ్లచెర్వు,జాన్‌పహడ్ లైన్ నిర్మాణం పనులకు సప్లిమెంటరీ బడ్జెట్‌లో మరిన్ని నిధులివ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. రాయచూర్-గద్వాల, మాచర్ల లైన్ సర్వే, డిపిఆర్‌కు అనుమతిచ్చిందన్నారు. బీబీనగర్-నడికుడి డబ్లింగ్, ఎలక్ట్ఫ్రికేషన్‌కు సర్వే, డిపిఆర్‌కు కేంద్రం ఆమోదించిందన్నారు. హైద్రాబాద్-అమరావతి రైల్వే లైన్ నిర్మాణం ఆవశ్యకతను వివరించామన్నారు. ఆయా రైల్, రోడ్డు మార్గాల నిర్మాణాలతో జిల్లాలోని పార్లమెంటరీ నియోజకవర్గాలకు వాటికి మధ్య అనుసంధానం పెరిగి అభివృద్ధికి మార్గం పడిందన్నారు. ఈ సమావేశంలో డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పాశం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.