విశాఖపట్నం

సంక్రాంతి సెలవులకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ప్రత్యేక రైళ్ళు 40...బస్సులు 101
* అయినా ప్రైవేటు జోరు
విశాఖపట్నం, జనవరి 1: సంక్రాంతి పండుగ సెలవులు సమీపిస్తున్నాయి. దీంతో రైళ్ళు, బస్సులు సిద్ధమయ్యాయి. ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరు డివిజన్ కమర్షియల్ విభాగం అధికారులు ఎప్పటి మాదిర ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేశారు. అలాగే ఆర్టీసీ విశాఖ రీజియన్ తొలిసారిగా స్పందించింది. అప్పటికపుడే పరుగులు తీసేకంటే ప్రైవేటు బస్సులకు చెక్ పెట్టి తగినంత ఆదాయ లక్ష్యాలను సాధించే ఉద్దేశ్యంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ విధంగా విశాఖ నుంచి పలు రాష్ట్రాలకు అవసరమైన రైళ్ళను నిర్వహించడంలో వాల్తేరుడివిజన్, సుదూర ప్రాంతాలకు తగినన్ని బస్సులు నిర్వహణలో విశాఖ ఆర్టీసీ రీజియన్ రెండూ ఈసారి పోటీ పడుతూ సంక్రాంతి సెలవులకు సిద్ధపడుతున్నాయి.
* 40 ప్రత్యేక రైళ్ళు
సంక్రాంతి, వేసవి సెలవులను దృష్టిలోపెట్టుకుని వాల్తేరు డివిజన్ కమర్షియల్ విభాగం అధికారులు ఏకంగా 40 ప్రత్యేక రైళ్ళను నిర్వహిస్తున్నారు. రెండు వైపుల కలిపి 40 రైళ్ళను నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు ఇప్పటికే కొన్నింటినీ పట్టాలెక్కించగలిగారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలోపెట్టుకుని మరిన్ని ప్రత్కే రైళ్ళను ప్రవేశపెట్టడం, లేనిపక్షంలో కొన్ని ఎక్స్‌ప్రెస్‌లకు అదనపు కోచ్‌లు తగిలించడం వంటి చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్‌కు సాదారణ రోజుల్లో సైతం ఎన్ని రైళ్ళు నడుస్తున్నా చాలని పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర విభజన తరువాత కూడా హైదరాబాద్‌కు వెళ్ళే ప్రయాణికుల సంఖ్య ఎక్కడా తగ్గకపోగా మరింత పెరుగుతున్నారు. దీంతో పండుగలు,సెలవుల సీజన్లలో మరికొన్నింటినీ పట్టాలెక్కించాల్సి వస్తోంది. దీనిలోభాగంగానే హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్ళు వచ్చాయి. గోదావరి, విశాఖ, జన్మభూమి, గరీబ్థ్,్ర దురంతోలతోపాటు ఈ ప్రత్యేక రైళ్ళు నడుస్తాయి. ఇవి కాకుండా హౌరా నుంచి, భువనేశ్వర్ నుంచి విశాఖ మీదుగా మరికొన్ని రైళ్ళను నిర్వహించగలుగుతున్నారు. విశాఖ నుంచి కృష్ణరాజుపురం, బెంగుళూరు, హైదరాబాద్, తిరుపతి, శబరిమలై, చెన్నై, కోల్‌కత్తా, భువనేశ్వర్, సమత, స్వర్ణజయంతిలతోపాటు ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రతిరోజు నడపడం వంటివి జరుగుతున్నాయి. ప్రత్యేక రైళ్ళు, పాసింజర్‌లతో కలిపి దాదాపు 130 రైళ్ళు ప్రతిరోజు నడుస్తున్నాయి.
* 101 ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ సెలవులను దృష్టిలోపెట్టుకుని ఈన ఎల 10వ తేదీ నుంచి వరుసగా మూడు రోజులపాటు విశాఖపట్నం వచ్చే ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండే విధంగా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, తిరుపతి ప్రాంతాల నుంచి 101 బస్సులు నడువనున్నాయి. విశాఖ రీజియన్ ఆధ్వర్యంలో ఈసారి 101 ప్రత్యేక బస్సులు నిర్వహించడంతోపాటు ప్రయాణికుల నుంచి వచ్చే ఆదరణనుబట్టి విశాఖ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, సాలూరు, పార్వతీపురం, పాలకొండ, రాజాం, బొబ్బిలి, పలాస తదితర ప్రాంతాలకు ‘లోకల్ సర్వీసులు’ నడుస్తాయి. ఇళ్ళ నుంచి తిరుగు ప్రయాణాలు చేసే వారి కోసం ఈ నెల 16వ తేదీ నుంచి 18వరకు వరుసగా మూడు రోజులపాటు 95 ప్రత్యేక బస్సులు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
* నాలుగు కొత్త ఏసి బస్సులు
త్వరలో నాలుగు గరుడ+ ఏసి బస్సులు రానున్నాయి. తొలుత రెండింటిని రోడ్డెక్కించనున్నారు. కొద్దిరోజుల్లో మరో రెండు ఏసి బస్సులు రానున్నాయి. ఒక్కో ఏసి బస్సులు దాదాపు కోటి రూపాయలు ఉంటుందని ఆర్టీసీ విశాఖ రీజియన్ రీజనల్ మేనేజర్ సుదీశ్‌కుమార్ తెలిపారు. ఇవి కాకుండా త్వరలో 15 కొత్త సిటీ సర్వీసులు వస్తాయని, ఇవి ప్రయాణికుల నుండి డిమాండ్ కలిగి ఉండే రూట్లలో నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకం ప్రారంభం
అనకాపల్లి, జనవరి 1: స్థానిక వందపడకల ప్రభుత్వాసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకాన్ని ఆసుపత్రిలో ప్రసవం జరిగిన తల్లీబిడ్డలను ఇంటికి చేర్చేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక అంబులెన్సులను మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. ఎన్టీఆర్ వైద్య పరీక్షల ద్వారా 64రకాల వైద్య పరీక్షలు ఈ పధకంలో ఇకపై రోగులకు అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి గంటా తెలిపారు. ప్రసవం జరిగిన తల్లీబిడ్డలను వారి ఇంటికి క్షేమంగా పంపేందుకు 102 పేరుతో అంబులెన్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలోని పది ఆసుపత్రులకు ఈ అంబులెన్సుల సదుపాయం అమలులోకి వచ్చిందన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్యం అందించేందుకు సిఎం చంద్రబాబు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిద వార్డులను మంత్రి గంటా పరిశీలించి రోగుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు, జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ నాయక్, మంఢల పరిషత్ అధ్యక్షురాలు సావిత్రి, కశింకోట జెడ్పీటిసి మలసాల ధనమ్మ, ఆసుపత్రి సూపరింటెండెంట్ కుమారి, డిఎంఅండ్‌హెచ్‌వో సరోజిని, దేశం నాయకులు నాగజగదీష్, మళ్ల సురేంద్ర, డాక్టర్ సత్యవతి, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తల సమక్షంలో ఈనెలాఖరులోగా రాజకీయ భవిష్యత్‌ను ప్రకటిస్తా
మాజీమంత్రి కొణతాల
అనకాపల్లి, జనవరి 1: తాను చేరబోయే కొత్త పార్టీ విషయమై అభిమానుల అభిప్రాయాలు తెలుసుకుని అందుకు అనుగుణంగా ఈనెలాఖరులోగా వారి సమక్షంలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని మాజీమంత్రి కొణతాల రామకృష్ణ ప్రకటించారు. రాజకీయ భవిష్యత్‌పై చర్చించేందుకే ఇటీవల సిఎం చంద్రబాబును తాను కలిసానన్నారు. ఆ సందర్భంలో జరిగిన చర్చల అంశాలను కార్యకర్తల ముంగిటకు తీసుకువస్తానన్నారు. శుక్రవారం స్థానిక విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక విభజన చట్టం అమలుకాక తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, నిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తదితర ప్రాజెక్టులు ఇసుమంతైనా ముందుకు సాగలేదన్నారు. ఇదే విషయాలను సిఎం చంద్రబాబుతో తాను చర్చించానన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పధకం ఏర్పాటయితే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం వలన ఈ ప్రాజెక్టు అమలుకు మార్గం సుగమమైందన్నారు. ఎస్. రాయవరం సమీపంలోని పురుషోత్తపురం వద్ద పోలవరం కాలువకు అనుగుణంగా సత్వరమే ఎత్తిపోతల కాలువను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను సిఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు. బాక్సైట్ తవ్వకాల వలన జరిగే లాభనష్టాలపై సాంకేతిక స్టడీ జరగాల్సివుందన్నారు. బాక్సైట్ తవ్వకాల వలన వాతావరణ కాలుష్యం, తాగునీటి ఎద్దడి తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చీడికాడ జెడ్పీటిసి సత్యవతి, పివిజి కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అంకం రెడ్డి జమీలు, పెట్ల సింహాచలం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి
* ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు
చోడవరం, జనవరి 1: పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కట్టుబడి ఉండాల్సిందేనని జిల్లా టీడీపి అధ్యక్షులు, ఎమ్మెల్సీ సభ్యులు పప్పల చలపతిరావు అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్క్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఫిజియోథెరపీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో పార్టీని బలోపేతం చేయడం కోసం కొత్తవారిని పార్టీలోకి చేర్చుకోవడం జరుగుతుందన్నారు. దీనిని అడ్డుకునే ప్రయత్నాలు పార్టీ నాయకులు, కార్యకర్తలు చేయరాదన్నారు. రానున్న ఎన్నికల నాటికి రాష్టవ్య్రాప్తంగా సుమారు 50 అసెంబ్లీ నియోజకవర్గాల వరకు పెంపు జరిగే అవకాశముందన్నారు. అందుచే ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకున్నప్పటికీ ప్రయోజనమే తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. అందుచే పార్టీశ్రేణులు ఆందోళన చెందాల్సినవసరం లేదన్నారు. కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీచేయాల్సివుందన్నారు. ఈ విషయంలో ముందుగా మంత్రుల మధ్య ఏకాభిప్రాయం తీసుకువచ్చి ఆయా నామినేటెడ్ పోస్టుల ఖాళీలను భర్తీచేయడం జరుగుతుందన్నారు. అలాగే చలపతిరావు జన్మదిన వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే మాతోట రైతులతో ఆయన మాట్లాడుతూ రైతుసంఘాలు నాబార్డు ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన మాతోట పధకాన్ని ఆ ప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్క్ స్వచ్చంద సంస్థ కార్యదర్శి ప్రసాద్, ఫోరం ఫర్ ది బెటర్ చోడవరం సభ్యులు అల్లుతాతం నాయుడు, ఎన్. దేముడు తదితరులు పాల్గొన్నారు.

పేదలకు అందుబాటులో వైద్య సేవలు
* మంత్రి అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం, జనవరి 1: రాష్ట్రంలో వైద్య సేవలు పేదలందరికీ అందుబాటులోనికి తెచ్చే క్రమంలో ‘తల్లీబిడ్డి ఎక్స్‌ప్రెస్’ వాహనాలను ప్రారంభించామని పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. శుక్రవారం నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ఆయన ప్రీ డయోగ్నోసిస్ట్, డిజిటల్ ఎక్స్‌రే ల్యాబ్‌లను ప్రారంభించారు. ఆసుపత్రిలో ప్రసవం అయిన తరువాత బాలింతలను సురక్షితంగా వారి గృహాలకు తరలించేందుకు తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్ పేరుతో 5 వాహనాలను కూడా మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ కేంద్రాలలో 46 రకాల వైద్య పరీక్షలకు ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. అదే విధంగా డిజిటల్ ఎక్స్‌రే, టెలి మెడిసన్ ద్వారా ఆన్‌లైన్‌లోనే రోగ నిర్ధారణ, అవసరమైన చికిత్సను గూర్చి తెలుస్తుందన్నారు. నిపుణులైన వైద్యులు చికిత్సా విధానాన్ని కూడా పొందే అవకాశం ఉందన్నారు.