అక్షరాలోచన

దివ్యత్వమూర్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉలిదెబ్బలతో
దేహం దుమ్ము కొట్టుకపోతున్నా
కండరాలను కరిగించి
బండరాళ్లకు జీవం పోసి
అందమైన ఆకృతులుగా మలిచే
అమరశిల్పి జక్కన్నలు వారు
శిల్పారామము
అమరశిల్పి జక్కన్నలు వారు
శిల్పారామము
సుత్తి ఉలి శబ్దాలతో
సవ్వడి చేస్తుంటే
రాళ్లు వెన్నలా కరిగి
సుందర నాట్య భంగిమలుగా
నర్తిస్తాయి
వారి నిర్మలమైన నవ్వే
శిల్ప దరహాసము...
కదలని రాయికి రూపమిచ్చి
నిరాకార - సాకార
దైవ ప్రతీకలుగా మలిచి
చైతన్యమూర్తులుగా
నగిషీలు దిద్ది
అనునిత్యము
వేల అడుగుల కదలికలను
తనగుండా నడుస్తూ
మోకరిల్లేలా చేసే
దేవుళ్లు వారు.
అశరీరవాణి - ఆకాశవాణిగా
ఘంటసాల గొంతుకలో
‘ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మోగెనో...’
వింటూంటే
దైవత్వము ఆపాదించబడిన ‘శిల’
ఆపాదించిన ‘శిల్పి’
ఆశ్రీత నయనాల వీక్షణకు
మంగళకరమైన
‘దివ్యత్మ మూర్తులు’

**********

వెలితి
-నారాయణమూర్తి తాతా
9298 004 001

చుర్రుమంటున్న
ఎర్రని ఎండలో చల్లని
నీడ నడుచుకుంటూ వచ్చి
ఇక్కడే నిలబడేది.

వాన కురిసి వెలిశాక
చిరుగాలికి చిలిపి
చినుకు కులుకుతూ
ఇక్కడే పలకరించేది.

గజగజ వణుకుతూ
గాలిని తోడేసుకు వచ్చి
చలి ఒళ్లు ఝల్లుమనేలా
ఇక్కడే కౌగిలించుకునేది.

సంధ్య వేళల్లో
గూటి గుమ్మాలయి
కువకువలు కిలకిలలు
ఇక్కడే మాటలయ్యేది.

నీడల్ని చినుకుల్ని
కౌగిల్ని కువకువల్ని
నరికి పోగులు పెట్టి
ఎక్కడ పూడ్చి పెట్టారో కాని
వెలవెలబోతూ ఓ వెలితి
రెక్కలు కుట్టుకుని, గాయమై
ఇక్కడో చెట్టుండాలి.

**********************

అ‘శ్రద్ధాంజలి’?!

-కందాళై రాఘవాచార్య
9908612007

ఓహో!
పుట్టుకనాడు
గిట్టుకనాడు
మన అమర నాయకుల విగ్రహాల మెడలో
బరువైన పూలదండలు!
దండలపై దండలు
గజమాలలు - దర్బారు పొగలు
వేసిన వారి ప్రతి పేరు పొల్లుపోకుండా
పేరుపేరునా వార్తలే వార్తలు!
తెల్లారి విగ్రహాలపై వాడిన పూలను
తీసే నాయకులే లేరు - గుర్తుపట్టకుండా నిండిన వాడిన పూలు
ఎండకు ఎండి
వానకు నాని
గాలికి ఎప్పుడో రాలిపోతాయి
పూలు రాలి దారాలు మాత్రం
మెడలకు అలాగే ఉండిపోతాయి!
వాటిని తీసేవారే లేరు
మళ్లీ పుట్టిన రోజులకో
వర్థంతులకో మాత్రమే మాత్రాకాలమే
అమర నాయకుల విగ్రహాలు కనిపిస్తాయి
పాల అభిషేకాలు
జల అభిషేకాలు
పూల దండల జాతరలు
ఫొటోలు పోజులు!
ప్రతి ఏటా ఇదే తంతు - ప్రతి నాయకుని వంతు
అమర నాయకుల చౌరస్తాల్లో
వీరి సందేశాలు గ్రంథాల్లో
పైన మన నాయకుల ఆత్మలూ
ఈ హడావిడికి
శిలా విగ్రహాలైపోతాయి నిజంగానే!
*

-మడిపల్లి హరిహరనాథ్ 960 3577655