నల్గొండ

విద్యార్థులకు దక్కని ఏకరూప దుస్తుల భాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*1352 పాఠశాలల విద్యార్థులకు దరి చేరని దుస్తులు
నల్లగొండ , నవంబర్ 27 : విద్యాసంవత్సరం ప్రారంభమై 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు జిల్లాలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు భాగ్యం దక్కలేదు. జిల్లాలో 3వేల 50 పాఠశాలలు ఉండగా, అందులో అప్కో నుండి 3వేల 36 పాఠశాలలకు క్లాత్ సరఫరా కాగా మిగిలిన 14 పాఠశాలలకు క్లాత్ అందలేదు. యాజమాన్య కమిటీ సభ్యుల ద్వారా దర్జీలకు 3వేల 36 పాఠశాలల క్లాత్ అందించగా, 1వేయి 698 పాఠశాలలకు కుట్టిన దుస్తులు అందించారు. మిగిలిన 1352 పాఠశాలల విద్యార్థులకు ఆ భాగ్యం దక్కలేదు. జిల్లాలో 2లక్షల 20వేల 407 మంది విద్యార్ధులు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఆదర్శ పాఠశాలలలో విద్యనభ్యసిస్తున్నారు. కాగా సగం మందికి విద్యార్ధులకు మాత్రమే ఏకరూప దుస్తులు అందాయి. దీంతో గత యేడాది అందజేసిన దుస్తులు చిరిగినప్పటికీ విద్యార్ధులు ఇబ్బందులు పడుకుంటూ పాఠశాలలల్లో తమ చదువులు కొనసాగిస్తున్నారు. విద్యార్ధులకు సంవత్సరానికి ఒక్కొ విద్యార్ధికి రెండు జతల చొప్పున విద్యాశాఖ అధికారులు అందజేస్తారు. అయితే ఈ రెండు జతల క్లాత్‌కు అప్కోకు 320 రూపాయలు చెల్లిస్తున్నారు. పాఠశాలలకు క్లాత్ సరఫరా కాగానే ఉపాధ్యాయులు, యాజమాన్య కమిటీ సమావేశమైన తర్వాత యాజమాన్య కమిటీ సభ్యులు దర్జీలకు అందజేస్తారు. ఇందుకు గాను రెండు జతలకు 80 రూపాయల కుట్టుకూలీ చెల్లించడం జరుగుతుంది. మొత్తం 400రూపాయలు ఒక్క విద్యార్ధికి కేటాయించడం జరుగుతుంది. మండలంలోని 59 మండలాల్లో 12 మండలాల్లో మాత్రమే మొత్తం పాఠశాలల విద్యార్ధులకు దుస్తులు అందజేశారు. వలిగొండ, మట్టంపల్లి, మేళ్లచేర్వు, రాజాపేట, తిప్పర్తి, త్రిపురారం, మర్రిగూడ, కేతేపల్లి, కట్టంగూర్, గరిడేపల్లి, పెన్‌పహాడ్, కనగల్ మండలాల విద్యార్ధులకు దుస్తులు అందాయి. దర్జీల దగ్గర నుండి ఏమాత్రం దుస్తులు అందని జాబితాలో బీబీనగర్, జాజిరెడ్డిగూడెం, నాంపల్లి, నూతన్‌కల్, పెద్దవూర మండలాలు ఉన్నాయి.
అదే విధంగా బొమ్మల రామారం మండలంలో 52 పాఠశాలలకు గాను 8 పాఠశాలలకు మాత్రమే దర్జీల నుండి దుస్తులు విద్యార్ధులకు అందాయి. చింతపల్లిలో 52 పాఠశాలలకు గాను 13 పాఠశాలలకు, చివ్వెంలలో 56 పాఠశాలలకు గాను 6 పాఠశాలలకు, గుండాలలో 31 పాఠశాలలుండగా అప్కో నుండి 30 పాఠశాలలకు క్లాత్ సరఫరా కాగా, దర్జీల నుండి 8 పాఠశాలలకు దుస్తులు అందాయి. గుండ్లపల్లిలో 45 పాఠశాలలకు గాను 18 పాఠశాలలకు, హుజూర్‌నగర్‌లో 30 పాఠశాలలకు గాను 10 పాఠశాలలకు, మోతెలో 45 పాఠశాలలకు గాను 2 పాఠశాలలకు, మోత్కూర్‌లో 50 పాఠశాలలకు గాను 10 పాఠశాలలకు, మునగాలలో 39 పాఠశాలలకు గాను 9 పాఠశాలలకు, మునుగోడులో 42 పాఠశాలలకు గాను 20 పాఠశాలలకు, నడిగూడెంలో 48 పాఠశాలలకు గాను 2 పాఠశాలలకు, నల్లగొండలో 95 పాఠశాలలకు గాను 44 పాఠశాలలకు, సంస్ధాన్ నారాయణపురంలో 45 పాఠశాలలకు గాను 18 పాఠశాలలకు, నేరేడుచర్లలో 64 పాఠశాలలకు గాను 28 పాఠశాలలకు, పెద్దఅడిశర్లపల్లిలో 56 పాఠశాలలకు గాను 15 పాఠశాలలకు, సూర్యాపేటలో 82 పాఠశాలలకు గాను 2 పాఠశాలలకు, తిరుమలగిరిలో 49 పాఠశాలలకు గాను 2 పాఠశాలలకు, తుంగతుర్తిలో 59 పాఠశాలలకు గాను 20 పాఠశాలలకు, తుర్కపల్లిలో 58 పాఠశాలలకు గాను 8 పాఠశాలలకు, యాదగిరిగుట్టలో 52 పాఠశాలలకు గాను 14 పాఠశాలలకు దర్జీల నుండి కుట్టిన దుస్తులు సరఫరా అయ్యాయి.
మిగిలిన 22 మండలాలలో సగం పాఠశాలలకు మాత్రమే దుస్తులు సరఫరా అయ్యాయి. ఆలేరు మండలంలో 3 పాఠశాలలకు, అనుగుల మండలంలో 5 పాఠశాలలకు, చౌటుప్పల్‌లో 4 పాఠశాలలకు, గుండాలలో 1 పాఠశాలకు అస్సలు అప్కో క్లాతే సరఫరా కాలేదు. మిగిలిన పాఠశాలలకు దుస్తులు సరఫరా కాకపోవడంతో విద్యార్ధులకు ఇబ్బందులు తప్పడం లేదు. నవంబర్ 24న జిల్లా కేంద్రంలో నిర్వహించిన విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలో దుస్తుల పంపిణిలో అధికారుల పనితీరుపై నల్లగొండ, భువనగిరి ఎంపీలు, ఆయా మండలాల ఎంపిపిలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ భావిభారత పౌరులకు సకాలంలో పుస్తకాలతో పాటు దుస్తులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.