విశాఖపట్నం

ఏయూకు గ్రేడెడ్ అటానమీ హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 21: ఆంధ్రా యూనివర్శిటీకి గ్రేడెడ్ అటానమీ హోదాను యూనివర్శిటీ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. నాక్ గ్రేటింగ్‌లో ఆంధ్రా యూనివర్శిటీ 3.60 మార్కులను సాధించింది. రాష్ట్రంలో 3.52 మార్కులు సాధించి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ రెండో స్థానంలో నిలిచింది. డీమ్డ్ యూనివర్శిటీలో గీతం నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది. ఏయూకు గ్రేడెడ్ అటానమీ హోదా రావడం వలన వచ్చే ప్రయోజనాల గురించి వర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఉమామహేశ్వరరావు తెలియచేశారు. ఇప్పటి వరకూ ఆంధ్రా యూనివర్శిటీ సెమీ అటానమీ హోదాలో ఉండేది. యూజీసీ, రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేయాల్సి వచ్చేది. ఇప్పటికే ఆంధ్రా యూనివర్శిటీ యుజీసీ కోర్సులకు భిన్నమైన కోర్సులను ప్రవేశపెట్టి దేశ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంది. ఇప్పుడు గ్రేడెడ్ అటానమీ హోదా లభించడంతో మరిన్ని కొత్త కోర్సులను ప్రవేశపెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. విదేశీ ఫ్యాకల్టీని కూడా నియమించుకోడానికి ఆస్కారం ఉంది. యూజీసీ అనుమతి లేకుండా దేశ వ్యాప్తంగా ఏయూ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుందని రిజిస్ట్రార్ వెల్లడించారు. దీనివలన ప్రపంచ స్థాయిలో ఆంధ్రా యూనివర్శిటీకి మంచి గుర్తింపు లభించుందని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఫలితంగా విదేశీ విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందని అన్నారు. ఓపెన్ రీసెర్చ్ పార్క్‌లు, ఇంక్యుబేషన్ సెంటర్లు, సమాజంతో అనుసంధానంగా విశ్వవిద్యాలయాలు చేపట్టే కార్యక్రమాలను సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో నిర్వహించుకోడానికి అవకాశం ఏర్పడిందని అన్నారు. యూజీసీతో అనుమతి లేకుండా ఏయూ స్వతంత్రంగా, ఇతర ప్రైవేటు సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని చెప్పారు. ఇప్పటికే ఏయూలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌ను వెయ్యి కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారు. గ్రేడెడ్ అటానమీ హోదా రావడం వలన వర్శిటీ అభివృద్ధికి కావల్సిన నిధులను సమకూర్చేందుకు ఫండింగ్ ఏజెన్సీలు ముందుకు వస్తాయని ఆయన తెలియచేశారు.

మెడలు వంచైనా హోదా, విభజన హామీలు సాధిస్తాం
* సీపీఎం మహాపాదయాత్రలో వక్తలు
విశాఖపట్నం, మార్చి 21: కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించి తీరుతామని వక్తలు ఉద్ఘాటించారు. ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన కోసం సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రను ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వద్ద సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ మధు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల పాటు టీడీపీ, బీజేపీ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో తాత్సార వైఖరి అవలంభించి, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త నాటకాలకు తెరతీశాయన్నారు. కేంద్రంలో నాలుగు బడ్జెట్‌లు ప్రవేశపెట్టి రాష్ట్రానికి అన్యాయం చేసినా స్పందించని టీడీపీ, చివరి బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధం కావడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. హోదాపై ఉద్యమిస్తున్న విపక్ష పార్టీలపై కేసులు పెట్టి వేధించిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు, హోదాకోసం తాము ఉద్యమిస్తున్నామంటూ ప్రదర్శనలు చేయడం ప్రజలను వంచించడమేనన్నారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే బీజేపీ ఎందుకు భయపడుతోందన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ విభజన సందర్భంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారని, ఐదు కాదు పదేళ్లు కావాలని బీజేపీ, పదిహేనేళ్లు ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేశాయని గుర్తు చేశారు. హోదా అంశాన్ని గాలికొదిలేసిన టీడీపీ తాజాగా హోదా కోసం ఉద్యమం అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ రాష్ట్ర హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఫైలుపై సంతకం చేస్తానంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించడాన్ని ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు.