విశాఖపట్నం

ఉనికి చాటుకునేందుకే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: గత నాలుగేళ్ల కాలంగా స్తబ్ధతగా ఉన్న మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకే అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చి చంపారని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఘటన విషయం తెలుసుకున్న చినరాజప్ప ఆదివారం మధ్యాహ్నం హుటాహుటిన విశాఖ చేరుకున్నారు. టీడీపీ కార్యాలయంలో సహచర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలతో కలిసి మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి సంఘటనలు సరికాదన్నారు. విశాఖ మన్యంలో పూర్తిగా నిర్వీర్యమైపోయిందనుకున్న తరుణంలో మావోయిస్టులు ఇటువంటి సంఘటనలకు దిగడం సరికాదన్నారు. ఇదే సందర్భంలో ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులను పొట్టనపెట్టుకోవడం మావోయిస్టులకు మంచిది కాదన్నారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలతో మమేకమై ఉంటారని, దీన్ని అవకాశంగా తీసుకుని మావోయిస్టులు దుశ్చర్యలకు దిగటం సముచితం కాదన్నారు. నాలుగేళ్లుగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎంతో చేసిందని, గిరిజనుల కోసం నిరంతరం పనిచేసే గిరిజన ఎమ్మెల్యేను పొట్టనపెట్టుకోవడం భావ్యం కాదన్నారు. ప్రజా జీవితంలో ఉన్న తాము తప్పు చేస్తే ప్రజలే శిక్ష వేస్తారని, ప్రాణాలు తీసే అధికారం మీ కెవరిచ్చారంటూ మావోల తీరును ఖండించారు. తనకు కూడా మావోల నుంచి ముప్పు పొంచి ఉందన్నారు. బీజేపీ శాసనసభ పక్ష నేత పీ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను మావోయిస్టులు మట్టుపెట్టడాన్ని బీజేపీ తరపును ఖండిస్తున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీలో సహచరుణ్ణి కోల్పోయానని విలపించారు. ఇదే సందర్భంలో అభిమానులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, కేఎస్‌ఎన్ రాజు, పంచకర్ల రమేష్‌బాబు, బండారు సత్యనారాయణ మూర్తి, పీలా గోవింద్, పల్లా శ్రీనివాస్, వాసుపల్లి గణేష్‌కుమార్, వంగలపూడి అనిత, పార్టీ ప్రతినిధులు పుచ్చా విజయ్‌కుమార్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. అనంతరం సర్క్యూట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లడుతూ ప్రజాప్రతినిధులుగా సేవలందించే నాయకులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. జరిగిన దుర్ఘటన అత్యంత దురదృష్టకరమని, ప్రజాస్వామ్య వాదులు ఖండించాలన్నారు. మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్న నేతలను కాల్చి చంపడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధులుగా ప్రజాజీవితంతో ముడిపడిన నేతలపై తుపాకులు గురిపెట్ట మట్టుపెట్టే దుశ్చర్యలను ప్రజాస్వామ్య వాదులు ఖండించాలన్నారు.

ఎంతోకాలంగా విశాఖలోనే నివాసం
విశాఖపట్నం, సెప్టెంబర్ 23: అరకు ప్రాంతంలో చురుకైన రాజకీయ నాయకునిగా ఎదిగిన కిడారి సర్వేశ్వర రావుకు మావోయిస్టుల నుంచి ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్న అనుమానం వేధిస్తూ ఉండేది. విశాఖ ఏజెన్సీకి చెందిన సర్వేశ్వరరావు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ప్రజా ప్రతినిధులే లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహించే మావోయిస్టుల వల్ల ముప్పు తప్పదని భావించేవారు. ఈ నేపథ్యంలో సర్వేశ్వర రావు భార్య పరమేశ్వరి, పిల్లలు సందీప్, శర్వాన్, కౌశికలతో విశాఖ నగరం ఎంవీపీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు విజయవాడలో చదువుకుంటూ అక్కడే ఉంటున్నారు. భార్య పరమేశ్వరి నగరంలోనే సెరీకల్చర్ శాఖలో సహాయం సంచాలకులుగా ఉద్యోగం చేస్తున్నారు. దీంతో ఆయన నగరంలోనే నివాసం ఉంటూ తరచు నియోజకవర్గంలో పర్యటించేవారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అనంతరం పార్టీ ఆదేశాల మేరకు గ్రామదర్శిని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గ్రామదర్శినిలో పాల్గొనేందుకు శనివారం ఉదయమే విశాఖ నుంచి బయలుదేరి అరుకు వెళ్లారు.డుంబ్రిగుడ మండలం కాండూంలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నట్టు మావోలకు ముందస్తు సమాచారం ఉంది. అయితే ఎమ్మెల్యే సర్వేశ్వర రావు ఏమరుపాటుతో ఉండటమే ఆయన ప్రాణాలను బలితీసుకుందని అభిమానులు భావిస్తున్నారు.