విశాఖపట్నం

సామాజిక బాధ్యతగా నేత్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 4: నేత్రదానాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఈ విధమైన భావనతో ఎక్కువ మందికి కంటి చూపు ప్రసాదించే వీలు కలుగుతుందన్నారు. జిల్లా అంధత్వ నివారణా సంస్థ నేత్రదాన పక్షోత్సవాలను ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 8 వరకూ నిర్వహిస్తున్నది. దీనిలో భాగంగా నేత్రదానంపై అవగాహన కల్పించేందుకు నగరంలోని బీచ్ రోడ్డులో ఆదివారం నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత్రదానం చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని, సరైన సమాచారం అందించి నేత్రదానానికి తగిన పరిస్థితులు కల్పిస్తామన్నారు. మరణానంతరం కూడా జీవించడం నేత్రదానం వల్లే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో కూడా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఇందుకు స్వయం శక్తి సంఘాల సహాయం తీసుకుంటామన్నారు. సేకరించిన నేత్రాలను నిల్వ చేసేందుకు, నేత్రాలను సకాలంలో సేకరించేందుకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను నివృత్తి చేసేందుకు వైద్యాధికారులు, కార్యకర్తలు సమాధానం చెప్పగలిగి ఉండాలన్నారు. జిల్లాలో కార్నియా సమస్యల వల్ల అధిక శాతం కంటి చూపు కోల్పోతున్నారన్నారు. నేత్రదానం ద్వారా వారికి తిరిగి కంటి చూపు ప్రసాదించవచ్చన్నారు. 2020 నాటికి అంధత్వ నివారణే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మోహిసిన్ నేత్ర నిధి ప్రతినిధి ఎవిఎన్ చెడ్డో, డిఎంహెచ్‌ఒ సరోజిని తదితరులు పాల్గొన్నారు.