విశాఖపట్నం

నిరసన జ్వాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 8: విశాఖ రైల్వేజోన్‌పై కేంద్రం వైఖరిని నిరసిస్తూ అఖిలపక్షం మరోసారి రోడ్డెక్కింది. జోన్ ప్రకటన చేసేంతవరకు ఉద్యమాలు తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. విజయవాడలో ఏర్పాటు చేయాలనే కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అఖిలపక్షం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం దొండపర్తిలోని డివిజనల్ రైల్వేమేనేజర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. జోన్‌ను ఇక్కడ కచ్చితంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ధర్నాలో సిపిఎం రాష్టక్రార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు, సిపిఐ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పార్టీ నాయకులు మళ్ళ విజయప్రసాద్, కొయ్య ప్రసాదరెడ్డి, తిప్పల గురుమూర్తిరెడ్డి, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్‌ఎస్ శివశంకర్ తదితర ప్రజా సంఘాల ప్రతినిధులు, ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారందరితో నిండిన ఈ ప్రాంతంలో రైల్వేప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్), నగర పోలీసుల బలగాలో మొహరించాయి.
ఆందోళన భగ్నం...
జోన్ కోసం చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేసే ప్రయత్నంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం నెలకొంది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా డిఆర్‌ఎం కార్యాలయం నాలుగు వైపుల పోలీసుల భారీగా బందోబస్త్ నిర్వహించారు. ముళ్ళ కంచెలు సైతం ఏర్పాటు చేశారు. అయినా ఆందోళనకారులు ఎక్కడా వెనక్కి తగ్గకుండా ధర్నాలో పాల్గొనేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. ఇందులోభాగంగా నినాదులతో హోరెత్తిని వీరిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇది కాస్త చిలికి,చిలికి గాలివానగా మారడంతో వీరందర్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్న పోలీసులు చేతికందినవారిని అందినట్టుగానే అదుపులోకి తీసుకుని వ్యాన్‌లోకి ఎక్కించారు. దీంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పెద్దఎత్తున నినాదాలు చేసిన నిరసన తెలియజేసిన అఖిలపక్ష నేతలందరితోపాటు 91 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
జోన్ ఉద్యమం తీవ్రతరం
ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ జోన్ ఉద్యమాన్ని మరింతగా తీవ్రతరం చేస్తామని, అణగదొక్కేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. విజయవాడకు జోన్ తరలిపోతుందన్న సమాచారంతో ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అనేక రకాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్రకు అన్నివిధాలా అన్యాయం జరుగుతుందన్నారు. ఇపుడు జోన్‌ను లేకుండా చేస్తే ఈప్రాంతం పూర్తిగా వెనుకబడటం ఖాయమన్నారు. 14 ఏళ్ళుగా పెండింగ్‌లో ఉన్న రైల్వేజోన్ విషయంలో ప్రజాప్రతినిధులంతా పార్టీలకతీతంగా పోరాటాలకు దిగాల్సిందిగా పిలుపునిచ్చారు. ఇటు ప్రత్యేక హోదా, మరోపక్క జోన్ విషయంలోను ఆంధ్రాకి కేంద్రం అడుగడుగునా అన్యాయం చేస్తుందన్నారు.