విశాఖపట్నం

‘వర్గీకరణ ఉద్యమం అంతిమ దశకు చేరుకుంది’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గత 22 ఏళ్ళుగా మంద కృష్ణ మాదిగా నాయకత్వంలో సాగుతున్న పోరాటం అంతిమ దశకు చేరుకుందని ఆంధ్రవిశ్వవిద్యాలయం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్) అధ్యక్షులు చదువుల ఆశాకిరణ్ అభిప్రాయపడ్డారు. విశాఖ విమానాశ్రయలో ఆశాకిరణ్ నేతృత్వంలో పలువురు ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు స్వాగడం పలికారు. జనాభా ధామషా ప్రకారమే రిజర్వేషన్ ఫలాలు ఎస్సీలకు దక్కాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ సాధన దిశగా గత 22 ఏళ్ళుగా కృష్ణమాదిగ పోరాటం అమోఘమన్నారు. రెండు దశాబ్ధాలకు పైగా ఉద్యమాన్ని నిర్మించి ఇప్పటివరకు నిలబెట్టడం ఆయన త్యాగనిరతికి నిదర్శనంగా పేర్కొన్నారు. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు మర్రిపాలెం అంబేద్కర్ పంక్షన్ హాల్‌లో ఎంఆర్‌పిఎస్ జిల్లా సన్నాహక సభ ఉంటుందన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధనకు నవంబర్ 20న హైదరాబాద్‌లో జరుగబోవు మాదిగల ధర్మయుద్ధ మహాసభను విజయవంతం చేయడంలో భాగంగా దీనిని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.