విశాఖపట్నం

దేశ ఆర్థిక వ్యవస్థకు అంతరిక్ష పరిశోధనలు కీలకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 8: దేశ ఆర్థిక వ్యవస్థకు అంతరిక్ష పరిశోధనలు కీలమని ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ వి.రంగనాథన్ తెలిపారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు జరిగే వివిధ కార్యక్రమాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ భవనంలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయ న మాట్లాడుతూ వరి సహా వివిధ పంటల దిగుబడి శాతాన్ని రెండు శాతం కచ్చితత్వంతో వివరాలను ఉపగ్రహాలను ఉపయోగించి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల ఏ పంట ఎంత మేరకు దిగుబడి వస్తుందో తెలుసుకుని, ఎగుమతి, దిగుమతులను నిర్ణయిస్తారన్నారు. ఉపగ్రహాలను ఉపయోగించి చేపల లభ్యతను కూడా గుర్తిస్తున్నామన్నారు. చేపలు సమూహాలుగా కదులుతుంటాయని, దీనిని గుర్తించి, అవి ఉన్న ప్రాంత వివరాలను ప్రభుత్వానికి తెలియచేస్తామన్నారు. ప్రభుత్వం ఆ వివరాలను మత్స్యకారులకు సంక్షిప్త సందేశాల ద్వారా తెలియచేస్తుందని తెలిపారు. దీని వల్ల మత్స్యకారులకు మేలు చేకూరుతుందన్నారు. ఇస్రో చేపట్టిన అనేక పరిశోధనలు ప్రజలకు చేరువయ్యాయన్నారు. విశాఖలో విధ్వంసం సృష్టించిన హుదూద్ తుపాను గురించి ఉపగ్రహాలు సమచారం అందించకుంటే మరింత విధ్వంసం జరిగేదని వివరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య నాగేశ్వరరావు మాట్లాడుతూ భారత్‌కు చెందిన నూక్లియర్, అంతరిక్ష శాస్తవ్రేత్తలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. అమెరికా విధించిన ఆంక్షల కారణంగా యురేనియం సరఫరా నిలిపివేయగా, యురేనియంకు ప్రత్యామ్నాయంగా పదార్ధాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయంగా అభివృద్ధి చేశారన్నారు. దీనితోనే బ్రీడర్ రియాక్టర్లను తయారు చేశారని గుర్తు చేశారు. దీంతో అమెరికన్ అధ్యక్షుడు ఒబమా భారత్ పర్యటించాల్సి వచ్చిందన్నారు. నూక్లియర్ శాస్తవ్రేత్తలను అమెరికా పంపాలన్న ఎజెండాతో భారత్ వచ్చారు. దీంతో భారత్‌పై ఉన్న ఆంక్షలను తొలగించాల్సి వచ్చిందన్నారు. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి ఇతర దేశాలు తమ తొలి ప్రయోగాల్లో విఫలంగా, భారత్ ఒక్కటే అన్ని తొలి ప్రయోగాల్లో విజయం సాధించిందని గుర్తు చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే బడ్జెట్ కేటాయింపులు తక్కువ అయినప్పటికీ, అత్యున్నత ఫలితాలను సాధిస్తున్నదన్నారు. ఎక్కువ సంఖ్యలో ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టగలిగే అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరిందన్నారు. విమానాల ప్రస్తావన రామాయణంలో ఉందని, భారతీయుల మేథాశక్తి అపారమన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.రంగనాథన్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య విజయప్రకాష్, ఎయు రిజిస్ట్రార్ ఆచార్య ఉమా మహేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి రాకెట్ల నమూనాలను విద్యార్థులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలను, ఇస్రోకు సంబంధించిన వివిధ చిత్రాలను ప్రదర్శించారు.

అంబేద్కర్‌కు నోబుల్ బహుమతి ఇవ్వాలి
* ఎస్సీ, ఎస్టీ కమిషనర్ చైర్మన్ కారం శివాజీ
ఎస్.రాయవరం, అక్టోబర్ 8: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్‌కు నోబుల్ బహుమతి ప్రకటించాలని రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు.శనివారం మండలంలోని వెంకటాపురం గ్రామంలో అంబేద్కర్ మెగా పవర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రపంచంలో మేధావి అని, అటువంటి వ్యక్తికి నోబుల్ బహుమతి ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషిచేయాలని ఆయన అన్నారు. దళితుల సంక్షేమం వారిపై జరుగుతున్న దాడులను అరికట్టేలా ప్రత్యేక చట్టాలను తయారుచేశారన్నారు. రాజ్యాంగం రాసినప్పుడు తన పదవిని వదులుకున్న మహా వ్యక్తి అంబేద్కర్ అని, పార్లమెంట్‌లో రాజ్యాంగం ప్రవేశపెట్టినప్పుడు అంటరానితనంపై రాజ్యాంగంలో వివరించారని ఆయన అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్‌గా తనను నియమించిన చంద్రబాబుకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ద్వారా విదేశాల్లో జరిగే దళిత విద్యార్థులకు ఆర్థిక సాయం, సివిల్ సర్వీస్ పరీక్షల్లో పోటీల్లో పాల్గొనేందుకు అంబేద్కర్ స్టడీ సెంటర్ ద్వారా శిక్షణ, ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధుల వినియో గం, బ్యాక్‌లాగ్ ఉద్యోగాల నియామకాల కోసం చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. బిహెచ్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జెవి ప్రభాకర్ మాట్లాడుతూ దళితులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈ ప్రాంతంలో పుట్టిన మహాకవి గురజాడ దళితులపై ప్రత్యేక కావ్యం రచించారని ఆయన గుర్తుచేశారు. అనంతరం శివాజీని సన్మానించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు శ్యామ్‌సుందర్, బిహెచ్‌పిఎస్ జిల్లా అధ్యక్షులు శివప్రకాష్, కార్యదర్శి వెంకట్రావు, న్యాయవాది బైపా అరుణ్‌కుమార్, స్థానిక నాయకులు పామారావు, గణపతి రాజు, శ్రీను, లోవకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సాధికార సర్వే యుద్ధ ప్రాతిపదికన
పూర్తి చేయాలి
* కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, అక్టోబర్ 8: ప్రజా సాధికార సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లతో శనివారం సమావేశమైన కలెక్టర్ గ్రామాల్లోను, వార్డుల్లోను ఇంటింటికీ వెళ్లి సమాచారాన్ని సేకరించాలన్నారు. జిల్లా అంతటా ప్రస్తు తం 65 శాతం సర్వే కూడా పూర్తి కాలేదని, అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లు రోజుకు కనీసం 40 ఇళ్ల నుంచి సమాచారాన్ని సేకరించాల్సి ఉందన్నారు.కొంతమంది సూపర్ వైజర్లు ఇప్పటికీ లాగిన్ కాలేదని అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద యం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ సర్వే నిర్వహించాలన్నారు. కొన్ని మండలాల్లో సర్వే పూర్తి స్థాయిలో జరగట్లేదని, సమస్య ఎదురైన చోట సూపర్‌వైజర్లు తనిఖీ చేయాలని సూచించారు. సర్వే 2016 జనాభా లెక్కల ప్రాతిపదికన శత శాతం పూర్తి చేయాలన్నారు. సమయం తక్కువగా ఉన్నందున ప్రతి రోజు సాధికార సర్వేపై తాను సమీక్షిస్తానన్నారు. సిబ్బంది అలసత్వం వహించకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని అటువంటి వారికి పదోన్నతుల్లో, బదిలీల్లో గుర్తింపు ఉంటుందన్నారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ జె నివాస్, జెసి 2 డివి రెడ్డి, ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, ఎన్‌ఐసి అధికారి పాషా తదితరులు పాల్గొన్నారు.

కొణతాలకు ప్రముఖుల పరామర్శ
* పద్మావతికి నివాళ్లు
అనకాపల్లి, అక్టోబర్ 8: వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు ఆదివారం మాజీమంత్రి కొణతాల రామకృష్ణను కలిసి పరామర్శించారు. కొణతాల సతీమణి పద్మావతి ఇటీవల కాలం చెందిన విషయం విధితమే. పద్మావతి పెదకర్మ సందర్భంగా స్థానిక ఆదినారాయణ మహిళా కళాశాల ప్రాంగణంలో శనివారం పెద్దఎత్తున సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు, వైఎస్సాఆర్ సిపి నేత, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన రెడ్డి తదితరులు పద్మావతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించి కొణతాలను పరామర్సించారు. మాజీమంత్రులు వట్టి వసంతకుమార్, బలిరెడ్డి సత్యారావు, శాసనసభ్యులు భూమ న కరుణాకర రెడ్డి, పీలా గోవింద సత్యనారాయణ, గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ లా లం భవానీభాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గండి బాబ్జీ, ద్రోణంరాజు శ్రీనివాస్, గంటెల సుమన, మా నం ఆంజనేయులు, సిపిఐ రాష్ట్ర నాయకులు జెవి సత్యనారాయణమూర్తి, మాజీ మేయర్ పులుసు జనార్ధన్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గొర్లి రామ్మూర్తినాయుడు, వైఎస్సాఆర్ సిపి నేతలు తిప్ప ల నాగిరెడ్డి, పెట్ల ఉమాశంకర గణేష్, పివిజికుమార్, చీడికాడ జెడ్పీటిసి సత్యవతి, ప్రగడ నాగేశ్వరరావు, కోరాడ రాజబాబు తదితరులు కొణతాలను కలిసి పరామర్సించిన వారిలో ఉన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి అనూహ్య సంఖ్యలో వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని పద్మావతికి శ్రద్ధాంజలి ఘటించారు.

భూ సేకరణ చట్ట వ్యతిరేకం
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నర్సింగరావు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, అక్టోబర్ 8: పెట్రో యూనివర్సిటీ ఏర్పాటుకు విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో చట్ట వ్యతిరేకంగా చేపడుతున్న భూ సేకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు అన్నారు. జగదాంబ సమీపానున్న పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వంగలి గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 109, 135, 240, 241, 242లో గల సుమారు 700 ఎకరాల అసైన్డ్ భూములు ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. అయితే పెట్రో యూనివర్సిటీకి ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించిందని, అయితే వంగలిలో 700 ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి భూమి కావాల్సి వస్తే 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేయాలన్నారు. భూమి కోల్పోయి న రైతాంగం ఆమోదం మేరకు, భూమి మీద ఆధారపడిన వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు, చిరు వ్యాపారులకు చట్టంలో పొందుపరిచిన అన్ని హక్కులు కల్పించిన తరువాతే భూసేకరణ చేయాలని ఆ చట్టం చెబుతుందన్నారు.ప్రభుత్వం తీరు చట్ట విరుద్ధంగా ఉందని, కార్పొరేట్ శక్తుల లాభాల కోసం 2013 భూసేకరణ చట్టానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం 85 శాతం మంది రైతులు ఆమోదం తెలిపితే తప్ప భూసేకరణ చేయరాదన్నారు.చట్టానికి భిన్నంగా భూసేకరణను అడ్డుకుంటామని హెచ్చరించారు. అలాగే ఈనెల 20వ తేదీన ఈ భూముల్లో చేపట్టనున్న పెట్రో యూనివర్సిటీ శంకుస్థాపనను తాము అడ్డుకుంటామన్నారు. ఈ సమావేశంలో భూహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ డి.వెంకన్న, కార్యదర్శి ఏ.దేముళ్ళు, గ్రామ అధ్యక్షుడు యర్రా సోంబాబు, సీపిఎం చోడవరం డివిజన్ కన్వీనర్ గండి నాయనబాబు పాల్గొన్నారు.

ఇదిగో ఆణిముత్యాలు
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ప్రచారం
విద్యార్థుల ఫొటోలతో ఫ్లెక్సీలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, అక్టోబర్ 8: ప్రైవేటు పాఠశాల ల్లో చదువుకుంటూ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల ప్రతిభను ప్రచారం చేస్తూ వ్యాపా రం చేసుకుంటున్న విద్యా సంస్థలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడుతున్నాయి.అరకొర సౌకర్యాలున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ నూరు శాతం మార్కులు తెచ్చుకున్న విద్యార్థుల చిత్రాల తో తాము తీసిపోమని ప్రభుత్వ పాఠశాలలు భావిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థుల చిత్రాలతో ఫ్లెక్సీలు రూపొందించి ప్రచారం చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. దీనిలో భాగం గా ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతిలో 9కి పైగా మార్కులు సాధించిన వారి ఫొటోలతో ప్రచార ఫ్లెక్సీలను రూపొందిస్తున్నారు. రద్దీ కూడళ్లలోను, ఆర్టీసీ బస్‌ల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థుల ఫొటోలతో కూడిన పోస్టర్లను ప్రచారం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ద్వారా చదువులో రాణించే విద్యార్థులకు మంచి ప్రోత్సాహం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.