విశాఖపట్నం

కలెక్టరేట్‌కు స్మార్ట్‌కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 13: విశాఖ కలెక్టరేట్‌కు స్మార్ట్ కళ వచ్చేసింది. రాష్ట్ర విభజన తరువాత అత్యంత ప్రధాన్యత నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ ఇపుడు స్మార్ట్‌సిటీ స్థాయికి ఎదిగింది. దీంతో ఇక్కడి కలెక్టరేట్ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. దీనికి తగినట్టుగా దీని అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. అన్నివిధాలా దీనిని అభివృద్ధిపరుస్తున్నారు. నిరంత నిఘా అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం తక్షణమే క్లోజుడ్ సర్క్యూట్ టివీలను ఏర్పాటు చేసింది. ముఖ్యమైన విభాగాలకు అనుసంధానిస్తూ దాదాపు 50 కెమెరాలను అమర్చగలిగింది. కలెక్టరేట్‌లో అన్నీ ముఖ్యమైన విభాగాలే. కలెక్టర్, జెసి, డిఆర్‌ఓ ఛాంబర్లు, ఆర్డీవో కార్యాలయం, రెవెన్యూ, ల్యాండ్ సీలింగ్, జిల్లా ఖజానా, పౌరసరఫరాలు, సర్వే, ఓటర్ల, ప్రోటోకాల్ విభాగాలతోపాటు, వీడియో కానె్ఫరెన్స్ హాలు, ప్రజావాణి విభాగాలను నిర్వహిస్తున్నారు. ఈ విధంగా పలు విభాగాలతో నడుస్తున్న కలెక్టరేట్‌కు ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో ఫిర్యాదులు సమర్పించేందుకు జిల్లా నలుమూలల నుంచి అర్జిదారులు తరలివస్తుంటారు. అలాగే వారంలో కనీసం మూడు రోజులపాటు సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇవన్నీంటితోపాటు నిత్యం సందర్శకుల తాకిడి ఉంటూనే ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగి ఉండే కలెక్టరేట్‌లో నిఘా వ్యవస్థను పటిష్టపర్చాల్సి ఉందని భావించిన జిల్లాయంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం, వీటికి ఆమోదం లభించడంతో తొలి దశలోనే సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే ఆయా విభాగాల ద్వారా అందించే సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేలా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించగలుగుతున్నారు. ప్రతి విభాగంలో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయడంతో సకాలంలో విధులకు హాజరై సేవలందించేందుకు అవకాశం ఏర్పడింది.
ఆధునీకరణతో కొత్త శోభ
2014 అక్టోబర్ 12వ తేదీన విశాఖ నగరంలో సంభవించిన హుదూద్ తుపాను సృష్టించిన విధ్వంసానికి రెండేళ్ళు పూర్తయ్యింది. అయితే దీనివల్ల కలెక్టరేట్ పై కప్పుతోపాటు పలు విభాగాల్లో ఫర్నిచర్, కంప్యూటర్లు, కుర్చీలు, బల్లలు, ఏసిలు, విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ విధంగా దెబ్బతిన్న వాటన్నంటినీ పూర్తిస్థాయిలో ఆధునీకరించడం కోసం ప్రభుత్వం రెండు కోట్లకు పైగానే నిధులు మంజూరు చేసింది. వీటితో కలెక్టరేట్‌లో అన్ని విభాగాలను ఆధునీకరించారు. రెండేళ్ళుగా జరుగుతున్న ఆధునీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ విధంగా స్మార్ట్ కలెక్టరేట్‌గా కొత్త శోభను సంతరించుకుంటుంది.