విశాఖపట్నం

కాలుష్యం కాటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 16: విశాఖ నగరంలో కాలుష్యంపై యం త్రాంగం మరింత పటిష్ఠమైన చర్యలు చేపట్టాల్సి ఉందని పార్లమెంటరీ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ టి సుబ్బరామిరెడ్డి అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పర్యటనో భాగంగా విశాఖలో పర్యటించిన కమిటీ ఆదివారం నాడిక్కడ సమావేశ మై పలు అంశాలపై చర్చించింది.అనంతరం కమిటీ చైర్మన్ టిఎస్సార్ విలేఖరులతో మాట్లాడుతూ విశాఖపట్నం పోర్టు ట్రస్టు వల్ల నగరంలోని పాతబస్తీ కాలుష్యంతో విలవిల్లాడుతోందన్నారు. అయితే పోర్టు యాజమాన్యం రూ.280 కోట్లతో ఆధునీకరణ చేపట్టినట్టు చెపుతోందని, ఈ చర్యలు ఫలితాలిచ్చినట్టు లేదన్నారు. మరింత ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చుకుని నగరంలో కాలుష్యం తీవ్రతను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే స్టీల్‌ప్లాంట్ సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కాలుష్య నియంత్రణకు పెద్ద ఎత్తున మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు కమిటీ బ్యాం కర్లు, బీమా సంస్థలు, పిఎస్‌యు ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ విపత్తు లు సంభవించినప్పుడు బ్యాంకులు, బీమా సంస్థలు సత్వరమే స్పందించి, పరిహారం చెల్లించేందుకు ముం దుకు రావాలన్నారు. విశాఖలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మా ణం త్వరలోనే పూర్తవుతుందని, దీనివల్ల నిరుపేద క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటికే తాత్కాలిక వసతి ద్వారా క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు కేశవరావు, ముత్తుకురియప్ప, బిశ్వజిత్ థాయ్‌మరి, శంకర్‌భాయ్, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.