విశాఖపట్నం

క్రికెట్ ఫీవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్టోర్ట్స్) అక్టోబర్ 28: భారత్-న్యూజిల్యాండ్ జట్ల మధ్య కీలక పోరుకు ఏసిఏ-విడిసిఏ స్టేడియం సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తుపాను ఉపద్రవం నుంచి విశాఖ నగరం బయటపడటంతో మ్యాచ్ జరగడానికి అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. ఈ సిరీస్‌లో చెరో రెండు మ్యాచ్‌లను గెలుచుకున్న భారత్- న్యూజిల్యాండ్ జట్లు కీలకమైన ఈ మ్యాచ్‌లో హోరాహోరీ తలపడనున్నాయి. భారత్-న్యూజిలాండ్ జట్లు గురువారం పూర్తిగా విశ్రాంతి తీసుకుని శుక్రవారం స్టేడియంలో ముమ్మరంగా సాధన చేసాయి. ఉదయం తొమ్మిది గంటలకే సాధన ప్రారంభించిన భారత్ జట్టు దాదాపు నాలుగు గంటలపాటు ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో శ్రమించింది. అయితే భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్‌కొహ్లీ, రోహిత్‌శర్మ మాత్రం ప్రాక్టీస్ సెషన్‌లో గైర్హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి న్యూజిల్యాండ్ జట్టు నెట్స్‌లో పాల్గొని బ్యాటింగ్ బౌలింగ్‌లో సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రాక్టీస్ చేసింది.
కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడతా : కేదార్ జాదవ్
ప్రాక్టీస్ అనంతరం భారత్ జట్టు ఆల్‌రౌండర్ కేదార్‌జాదవ్ విలేఖరులతో మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో జట్టు కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు. ప్రతి మ్యాచ్‌లోను తాను కొత్త పాఠాలు నేర్చుకుంటున్నానని, పాజిటీవ్ దృక్పథంతో ముందుకు వెళ్తానని చెప్పారు. బౌలింగ్‌లో కెప్టెన్ ధోనీ, కోచ్ అనిల్‌కుంబ్లేల సూచనలను తీసుకుని బౌలింగ్ యాక్షన్‌లో, వేగంలో మార్పులు చేసుకుంటున్నానని వివరించారు. మ్యాచ్‌లో కనీసం అయిదు ఓవర్లు తనతో వేయించాలంటే కెప్టెన్‌కు తన బౌలింగ్‌పై నమ్మకం కలిగించాలని అన్నారు. బ్యాటింగ్‌లో స్వీప్ షాట్ తన స్ట్రాంగ్ పాయింట్ అని చెప్పాడు. ప్రత్యర్ధి తన వికెట్‌పై గురిపెట్టేటపుడు మంచి షాట్‌లను ఆడగలిగితేనే మంచి ఆటగాడిగా గుర్తింపు పొందగలుగుతామని చెప్పాడు. భారత్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ అద్భుతమైన బ్యాట్స్‌మెన్ అని, అతడు రాణిస్తే జట్టుపై ఎలాంటి వత్తిడి ఉండదని ఎలాంటి భారీ స్కోరునైనా భారత్ జట్టు చేదించగలుగుతుందని అన్నాడు.
రాంచీలో వేసిన వ్యూహంతో దిగుతాం : టిమ్ సౌథీ
న్యూజిల్యాండ్ పాస్ట్ బౌలర్ టిమ్‌సౌథీ మాట్లాడుతూ ఈ టూర్‌ను విజయంతో ముగించాలని ఉవ్విళ్లూరుతుందన్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఈ సీరిస్‌ను దక్కించుకోవడానికి ఇదే మంచి అవకాశమన్నాడు. రాంచీలో వేసిన వ్యూహం మాదిరిగానే మంచి కాంబినేషన్‌తో ఈ మ్యాచ్‌లో దిగబోతున్నామని, గత మ్యాచ్‌లో ఆరో బౌలర్ వ్యూహం ఫలించిందని అన్నాడు. అయితే ఈ వ్యూహం ఫలించాలంటే ఫిచ్ సహకరించాలని అభిప్రాయపడ్డాడు. కోరి ఆండ్రసన్ లాంటి మంచి యంగ్‌స్టర్స్ న్యూజిల్యాండ్ జట్టుకు అదనపు బలమని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే వీరట్ కోహ్లిని త్వరగా అవుట్ చేయడానికి ప్రయత్నిస్తామని, కోహ్లీతోపాటు ధోనీలాంటి మంచి బ్యాట్స్‌మెన్లు భారత్ జట్టులో ఉన్నారని అన్నాడు. అందువల్ల త్వరత్వరగా వికెట్లను కూల్చడంపైనే ఎక్కువుగా దృష్టిసారిస్తామని చెప్పాడు.