విశాఖపట్నం

కబలించిన వేగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్.రాయవరం, నవంబర్ 5: మండలంలోని అడ్డురోడ్డు జంక్షన్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళతోపాటు ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. గాజువాక శ్రీనగర్ కాలనీకి చెందిన బూడపాటి శ్రీనివాసరావు ఆయన భార్య శ్రీదేవి, బావ సిహెచ్ ప్రసాద్, గుడివాడకు చెందిన రమణ కలసి విజయవాడలోని తమ బంధువుల ఇంటికి కారులో బయలుదేరారు. అడ్డురోడ్డు సమీపంలోని గోగెడ్డ కాలువ వద్దనున్న వంతెనపై ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో కారు కల్వర్టును ఢీకొని కాలువలోకి బోల్తాపడింది. సుమారు గంటపాటు రక్షణ చర్యలు చేపట్టేందుకు అవకాశం లేకపోవడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు కారులోనే మృతిచెందారు. స్థానికులు మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నించినప్పటికీ వీలుపడలేదు. ఈ ప్రమాదంలో గాజువాకకు చెందిన బూడపాటి శ్రీనివాసరావు (45), జి. శ్రీదేవి (40), సిహెచ్ ప్రసాద్ (52), గుడివాడకు చెందిన రమణ (44)లు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి నక్కపల్లి సిఐ డి.రాంబాబు చేరుకుని కాలువలోపడిన వాహనాన్ని బయటకు తీసి మృతదేహాలను నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నక్కపల్లి ఎస్‌ఐ ఎల్.రామకృష్ణతోపాటు హోంగార్డులు, స్థానికులు మృతదేహాలను వాహనాల నుండి బయటకు తీసేందుకు ప్రయత్నించారు. జాతీయ రహదారిపై జరిగిన ఈ సంఘటనతో రోడ్డుకు ఇరుపక్కలాపెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో పాటు వాహనాల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులతోపాటు సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలాన్ని ఎఎస్పి ఐశ్వర్య రస్తోగి పరిశీలించి మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నించిన ఎల్.రామకృష్ణతోపాటు స్థానిక హోంగార్డులను అభినందించారు. ఇటువంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్థానిక విలేఖర్లకు తెలిపారు. స్థానిక ట్రాఫిక్ ఎస్‌ఐ హెచ్ మల్లేశ్వరరావు, ఎస్‌ఐ అరుణ్‌కుమార్ సహాయక చర్యలు చేపట్టారు.