విశాఖపట్నం

విమ్స్‌ను ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 7: ఉత్తరాంధ్ర ప్రజలు ఆరోగ్య సంజీవినిగా భావించే విమ్స్ ఆసుపత్రి విభాగాలను ప్రైవేటుపరం చేస్తే ఏ స్థాయిలోనైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ ఆసుపత్రిని సోమవారం ఆయన సందర్శించారు. వివిధ విభాగాల్లో ఉన్న రోగులను పరిశీలించి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ విమ్స్ స్పెషాల్టీ ఆసుపత్రిని గతంలో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సన్నద్ధం చేసిందన్నారు. అనంతరం టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటి కెబినెట్ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసి 60 కోట్లు ఇచ్చి వినియోగంలోకి తీసుకొస్తామన్నారన్నారు. రెండేళ్లు గడిచినా పూర్తిగా వినియోగంలోకి రాలేదన్నారు. ఆల్ట్రా మోడల్ ఫెసిలిటీతో పది విభాగాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం ఆరు బ్లాక్‌లున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇంకా తొమ్మిది బ్లాక్‌లు నిర్మించాల్సి ఉందన్నారు. ఇవన్నీ పూర్తయితే తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తాయన్నారు. కొన్ని విభాగాలను ప్రైవేటుపరం చేద్దామని ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ఈ ఆలోచన వెంటనే ఉపసంహరించుకుని దీనిని మరింతగా ఆధునీకరించి సదుపాయాలు మెరుగుపరిచి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అమరావతిలో వేలాది కోట్ల రూపాయలతో ఎయిమ్స్ నిర్మిస్తున్నారని, భవిష్యత్‌లో రాష్ట్రానికి ఒక ఆలిండియా మెడికల్ సైన్స్ ఇస్తున్నామని యుపిఐ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అప్పట్లో రాజశేఖర్‌రెడ్డి చైర్మన్‌గా అసోసియేషన్ ఏర్పాటైందన్నారు. ఎయిమ్స్ తరహాలోనే దీనిని ఆధునీకరించాలని, లేదంటే దానిని ఇక్కడికి తీసుకురావాలన్నారు. అపుడే ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. అన్ని రకాలుగా వెనుకబడిన ప్రాంతాలు కాబట్టి ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం తగదని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతాలకు అన్ని వైపులా అన్యాయం చేస్తున్నారని రైల్వేజోన్, మెట్రో తదితర వాటిపై ప్రభుత్వాలు మోసం చేశాయన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పెద్ద పట్నం విశాఖ అని ఇక్కడ సౌకర్యం లేనిది విజయవాడలో మెట్రో రైలుకు ఎలా అనుమతులు కుదిరాయని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధితో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలన్నారు. ఇప్పటి వరకు విశాఖలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే పెట్టుబడి సమావేశాలు ఇక్కడ, పరిశ్రమల స్థాపనేమో మరో ప్రాంతంలో చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎయిమ్స్ స్థాయిలో విమ్స్‌ను అభివృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలన్నారు.