విశాఖపట్నం

అథ్లెటిక్స్ పోటీలకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 22: ఈనెల 25 నుంచి మూడు రోజుల పాటు కల్నల్ సికే నాయుడు స్టేడియంలో జరగనున్న జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ (నిడ్‌జామ్) ఏర్పాట్లను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ అధికారులతో మాట్లాడుతూ క్రీడా పోటీలను విజయవంతం చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని, తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే వచ్చే ప్రేక్షకులు, ఇతరుల వాహనాలను నిలిపేందుకు స్ధలం కేటాయించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమం ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పర్యటనలో ఆయన వెంట జెసి 2 వెంకటరెడ్డి, డిఆర్‌డిఎ పిడి సత్యసాయి శ్రీనివాస్, ఎపిఐఐసి ఇడి మహేశ్వర రెడ్డి, పర్యాటక శాఖ ఇడి శ్రీరాములు నాయుడు, జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి జూన్ గాలియట్, తదితరులు పాల్గొన్నారు.