విశాఖపట్నం

మెట్రోపై నీలినీడలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 4: మహా విశాఖ నగరానికి మరింత వనె్న తెచ్చే విధంగా వస్తుందనుకున్న మెట్రో రైల్ ప్రాజెక్టు ఒక్క అంగుళం ముందుకు కదల్లేదు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) విధానంలో పూర్తి చేయాలని, దీనికి విదేశీ బ్యాంకులు సాయం అందిస్తాయని తొలి నుంచి భావిస్తున్నారు. అయితే ఇప్పటికే జపాన్ ఇంటర్నేషనల్ కోపరేటివ్ ఏజెన్సీ (జైకా) ఆర్థికసాయం అందించేందుకు తొలుత అంగీకరించి చివరికి ప్రాజెక్టు ఆర్థికంగా ఉపయుక్తంగా లేదని చేతులెత్తేసింది. దీంతో జర్మనీకి చెందిన ప్రభుత్వ బ్యాం కు (కెఎఫ్‌డబ్ల్యు)తో ఈ ప్రాజెక్టుపై అధికారులు సంప్రదింపులు జరిపారు. విభజనకు ముందు తొలి మెట్రో ప్రాజెక్టును అప్పటి కేంద్రంలో యుపిఎ సర్కారు విశాఖకు కేటాయించింది. అయితే అనూహ్యంగా విభజన అనంతరం విజయవాడ - గుంటూరు పరిసరాల్లో ని అమరావతి రాజధానిగా ప్రకటించడంతో అక్కడ కూడా మెట్రో ఆవశ్యకతను రాష్ట్రం వివరించింది. దీంతో కేంద్రంలోని ఎన్‌డిఎ సర్కారు విశాఖ తో పాటు విజయవాడకూ మెట్రోరైల్ ప్రాజెక్టు మంజూరు చేశారు. ఈ రెండు మెట్రోరైల్ ప్రాజెక్టులను ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ (డిఎంఆర్‌సి) పర్యవేక్షణ చేస్తుంది. సుమారు 13,500 కోట్ల వ్యయంతో 42.5 కిలోమీటర్ల మేర విశాఖ మెట్రోరైల్ నిర్మించాలని, అం దుకు అనుగుణంగా డిఎంఆర్‌సి ఆధ్వర్యంలో సమగ్ర పథక నివేదిక (డిపిఆర్) రూపొందించారు. మూడు కారిడార్లుగా 35 స్టేషన్లతో మెట్రోరైల్ ప్రాజె క్టు డిపిఆర్ కేంద్ర ఆమోదాన్ని పొం దింది. మొదటి కారిడార్ కొమ్మాది నుం చి గాజువాక వరకూ 30.38 కి.మీగాను, రెండో కారిడార్ గురుద్వార నుంచి పాతపోస్ట్ఫాసుకు 5.2 కిమీగాను, మూడో కారిడార్ తాటిచెట్లపాలెం నుం చి చినవాల్తేరుకు 6.9 కిమీగాను నిర్ణయించారు. మెట్రో ప్రాజెక్టుకయ్యే ఖర్చులో 20 శాతం కేంద్ర ప్రభుత్వం, మరో 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు, మిగిలిన మొత్తాన్ని ప్రైవేటు సంస్థల నుంచి సేకరించాలని నిర్ణయించారు. అంత వరకూ జెట్ స్పీడ్‌తో జరిగిన విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు ప్రతిపాదన పనులు ఒక్క సారిగా చల్లబడిపోయాయి. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుకు, రాబడికి తీవ్ర వ్యత్యా సం ఉండటంతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు విదేశీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వెనుకంజ వేస్తుండటంతో ప్రాజెక్టు గ్రహణం వీడట్లేదు. అయితే జర్మనీ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇప్పటికే ఒకసారి ప్రాజెక్టు డిపిఆర్ పరిశీంచినట్టు తెలిసింది. అయితే తాజాగా తెరపైకి వచ్చిన సంస్థ కూడా పెట్టుబడి - రాబడి అంశాన్ని భేరీజువేసుకుంటున్నట్టు సమాచారం.