విశాఖపట్నం

కాంగ్రెస్ బలోపేతానికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 5: ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శ్రీకారం చుడుతున్నట్టు మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వట్టి వసంతకుమార్ వెల్లడించారు. నగరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1980వ దశకంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనంతరం కాంగ్రెస్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొందని,ఈ సందర్భం లో సీనియర్ నాయకుడు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ చేపట్టిన కార్యక్రమాలు తిరిగి 1989లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో అటువంటి శక్తివంతమైన నాయకత్వం పనిచేసి, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయాల్సి ఉందన్నారు. ఈ ఉద్దేశంతోనే ఈ నెల 19న ద్రోణంరాజు జయంతిని పురస్కరించుకుని ఉత్తరాం ధ్ర కాంగ్రెస్ క్రియాశీలక కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడం ద్వారా కాంగ్రెస్‌కు గత వైభవాన్ని తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కార్యకర్తల మనోభావాలు, సలహాలు, సూచనలకు అనుగుణంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ ఏడు అంశాలతో కార్యకర్తల ముందుకువెళ్తున్నామన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు పి బాలరాజు, కొండ్రు మురళీమోహన్, పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, పార్టీ నాయకులు బెహరా భాస్కరరావు, యడ్ల ఆదిరాజు, పేడాడ రమణి కుమారి, నియోజకవర్గ ఇన్‌చార్జీలు గుంటూరు భారతి, మంత్రి రాజశేఖర్, జగ్గుబిల్లి అప్పలరాజు పాల్గొన్నారు.