విశాఖపట్నం

బ్యాంక్‌లు గ్రామాల దత్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 5: జిల్లాలోని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పూర్తి నగదురహిత లావాదేవీల నిర్వహణకు ఎంపిక చేసి ఆ గ్రామంలో శత శాతం బ్యాంకు ఖాతాలు తెరిచేలా చర్యలు చేపట్టనున్నట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.ఒక్కో బ్యాంకు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలో ప్రతి కుటుంబానికి జన్‌ధన్ ఖాతాలు తెరిచి రూపేకార్డులు ఇవ్వాలన్నారు. పూర్తి నగదురహిత లావాదేవీలకు ఎంపిక చేసిన గ్రామాల్లో కళాశాల విద్యార్థుల ద్వారా నగదురహిత లావాదేవీల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. దీనికిగాను ఒక్కో కళాశాలకు ఒక గ్రామాన్ని దత్తత ఇస్తామన్నారు. తద్వారా జిల్లాలో తొలిదశలో 38 మండలాల్లోని 38 గ్రామాలను నగదురహిత లావాదేవీలు నిర్వహించేలా రూపొందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. తొలుత మండలంలోని ఎంపిక చేసిన గ్రామానికి విద్యార్థులంతా వెళ్ళి ఆ గ్రామంలో బ్యాంకుఖాతాలు లేని కుటుంబాలను, రూపేకార్డు లేని వారిని గుర్తించాలని, ఆ తదుపరి దశలో బ్యాంకు ఖాతాలు తెరిపించడం, రూపేకార్డులు జారీ నగదు రహిత లావాదేవీలపై అవగాహన చేపట్టాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు, యూనివర్సిటీ, కళాశాలల అధికారులతోనగదురహిత లావాదేవీల నిర్వహణలో సాధించిన పురోగతి, ప్రభుత్వ శాఖల ద్వారా జరిగే లావాదేవీలకు సంబంధించి పిఓఎస్ మెషీన్లు ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పెట్రోలుబంకులు, వంటగ్యాస్ ఏజెన్సీల ద్వారా ఏయే బ్యాంకుల ఆధ్వర్యంలో పిఓఎస్ మిష న్లు ఏర్పాటు చేస్తున్నదీ వెంటనే బ్యాంకుల వారీగా మెషీన్ల ఏర్పాటుపై నివేదిక ఇవ్వాలన్నారు. జిల్లాలోని రైతుబజార్లలో 335 పిఓఎస్ మెషీన్లను ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటికే 179 మెషీన్ల కోసం బ్యాంకుల్లో ఖాతాలు తెరవడం జరిగిందని జిల్లా సరఫరా అధికారి నిర్మాలాభాయి వివరించారు. వ్యవసాయశాఖ పరిధిలో 105 మంది ఎరువులు, పురుగు మం దుల డీలర్లు పిఓఎస్ మిషిన్ల కోసం బ్యాంకు ల్లో దరఖాస్తు చేసినట్టు ఆ శాఖ అధికారి గోపిచంద్ తెలిపారు. రవాణాశాఖలో 57 మంది బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలు తెరిచినట్టు ప్రాంతీయ రవాణా కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు చెప్పారు. జిల్లాలో ఎస్‌బిఐ ఆధ్వర్యం లో 710, యాక్సిస్ బ్యాంకు ఆధ్వర్యంలో 400 పిఓఎస్ మెషీన్లు గత కొంతకాలంగా వినియోగంలో లేనట్లు తెలుస్తోందని, వాటిని ఎందుకు వినియోగించడం లేదో తెలియజేయాలని కలెక్టర్ ఎల్‌డిఎం శరత్‌బాబును కోరారు. కళాశాల విద్యార్ధులంతా పెద్దఎత్తున ఏపి పర్స్ వాలెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సాయినాథ్ వర్మ, ఎల్‌డిఎం శరత్‌బాబు, నాబార్డు ఏజిఎం ప్రసాదరావు, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, ఏయు రిజిస్ట్రార్ వెలగపూడి ఉమామహేశ్వరరావు, నగదు రహిత లావాదేవీల సమన్వయ అధికారి డాక్టర్ రామ్మోహన్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.