విశాఖపట్నం

పెరిగిన అప్పన్న హుండీ ఆదాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, డిసెంబర్ 6 : శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి హుండీ ఆదాయం పెరిగింది. నాలుగు విడతలుగా తెరిచిన హుండీల (29 రోజులు) ద్వారా సుమారు ఒక కోటి 19 లక్షల రూపాయల ఆదాయం నగదు రూపంలో వచ్చింది. గత నెలలో కేంద్రప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేస్తూ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం నేపథ్యంలో చిల్లర సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నెలరోజుల వ్యవదిలోనే నాలుగు పర్యాయాలు హుండీలను తెరిచి దేవస్థానం ఆదాయం లెక్కించించింది. తొలి పదిరోజుల్లో సుమారు రూ.41.61 లక్షలు, అనంతరం నాలుగు రోజులకు సుమారు రూ.19 లక్షలు, తరువాత నాలుగు రోజులకు సుమారు రూ. 13 లక్షలు, తాజాగా మంగళవారం లెక్కించిన హుండీల ఆదాయం ద్వారా సుమారు రూ.44.55 లక్షల రూపాయలు నగదు రూపంలో దేవస్థానానికి వచ్చింది. గడిచిన మూడు హుండీల ఆదాయంతో పోలిస్తే ఈసారి రద్దు చేసిన వెయ్యి, అయిదువందల రూపాయల నోట్లు సంఖ్య బాగా తగ్గింది. వెయ్యి, అయిదు వందల రూపాయల నోట్ల కట్టలు చెరొకటి వచ్చాయి. రెండువేల రూపాయల నోట్లు అనూహ్యంగా 113 రాగ, 20 రూపాయాల నోట్లు కూడా గతంలో ఎన్నడూలేని విధంగా 15వేల 583 వచ్చాయి. చిన్న నోట్ల ఆదాయం సుమారు 37.4 లక్షల వరకు రావడంతో చిల్లర సమస్యకు కాస్తయినా ఉపశమనం కలిగిస్తున్నామన్న సంతృప్తిని దేవస్థానం అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
* ఆర్డీవో పరిశీలనః- దేవస్థానం హుండీల ఆదాయం లెక్కింపు ప్రక్రియను ఆర్డీవో ఎస్. వెంకటేశ్వర్లు పరిశీలించారు. దేవాదాయశాఖ ఆదేశాల మేరకు దేవస్థానం లేఖ రాయగా ఆర్డీవో ఆదాయం లెక్కింపు పరిశీలించారు. దేవస్థానం చరిత్రలో రెవిన్యూ అధికారి హుండీల ఆదాయం పర్యవేక్షించడం ఇదే తొలిసారి కావడంతో ఉద్యోగుల్లో చర్చనీయంశమైంది. సాధారణంగా దేవాదాయశాఖ జిల్లా అధికారుల సమక్షంలో హుండీల ఆదాయం లెక్కించడం అనవాయితీగా వస్తోంది. ఈసారి అందుకు భిన్నంగా ఆర్డీవో పర్యవేక్షించడం గమనార్హం.