విశాఖపట్నం

భావ ప్రకటన నైపుణ్యాలు కలిగి ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, డిసెంబర్ 6: విద్యార్థులు శాస్త్ర విజ్ఞానంతో సమానంగా భావ ప్రకటన నైపుణ్యాలను కలిగి ఉండాలని ఏయూ వీసి ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఏయూ సైన్స్ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపధ్యంలో ఆంగ్లభాష నైపుణ్యాలు ఎంతో ప్రభావం చూపుతాయన్నారు. ఉపాధి కల్పనకు అవసరమైన సామర్ధ్యాలను ప్రతీ విద్యార్ధి అందిపుచ్చుకోవాలన్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సివి రామన్ మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నతికి వర్సిటీ విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. వీటిని సక్రమంగి వినియోగించుకోవడం అవసరమన్నారు. దేశ అవసరాలకనుగుణంగా యువతరం రాణించాలన్నారు. ప్లేస్‌మెంట్ అధికారి వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 70 మంది విద్యార్థులు శిక్షణకు హాజరవుతున్నారన్నారు. నిరంతరం విద్యార్థుల్లో శాస్త్ర సంబంధ, నైపుణ్యాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం విఎస్‌ఎస్ ప్రసాద్ విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకునే విధానాలను వివరించారు.