విశాఖపట్నం

ఓడిఎఫ్‌పై టాస్క్ఫోర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 6: బహిరంగ మల విసర్జన రహితం (ఓడిఎఫ్)గా తీర్చిదిద్దే క్రమంలో ఎక్కడైనా అతిక్రమణ జరిగితే కఠిన జరిమానాలకు వెనుకాడ వద్దని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా జిల్ల స్థాయి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ బహిరంగ మల విసర్జన నియంత్రించేందుకు టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. టాస్క్ఫోర్స్ నిరంతరం రహదార్లను సందర్శించి బహిరంగ మల విసర్జన జరిగితే, అందుకు బాధ్యులపై భారీ జరిమానాలు విధించాలని సూచించారు. టాస్క్ఫోర్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే బహిరంగ మల విసర్జన నియంత్రణ సాధ్యమేనన్నారు. దీనితో పాటు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణాలను శతశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై మెప్మా ప్రాజెక్టు అధికారి వాణికృష్ణ మాట్లాడుతూ జివిఎంసి సహా అనకాపల్లి, భీమునిపట్నం విలీన మున్సిపాలిటీలు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో 19,135 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయని తెలిపారు. మంజూరైన వాటిలో 17,362 వ్యక్తిగత మరుగుదొడ్లను జియో ట్యాగింగ్ చేశామని, వీటిలో 12,395 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. మిగిలిన మరుగుదొడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. జిల్లాలో 106 మున్సిపల్ వార్డులకు సంబంధించి 44 వార్డుల్లో ఓడిఎఫ్ పూర్తయించదని, మరో 50వార్డుల్లో వివిధ దశల్లో ఉన్నాయని, మరో 12 వార్డుల్లో పెండింగ్‌లో ఉందన్నారు. సమావేశంలో ఆర్‌జెడి ఆశాజ్యోతి, జివిఎంసి సిఇ చంద్రయ్య, హౌసింగ్ పిడి ప్రసాద్, మున్సిపల్, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.