విశాఖపట్నం

మహిళా రెజ్లర్‌లకు ఎమ్మెల్సీ మూర్తి అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, డిసెంబర్ 6: ఇటీవల నెల్లూరులో ముగిసిన రాష్ట్ర స్థాయి మహిళా రెజ్లింగ్ పోటీల్లో విజయం సాధించిన విశాఖ జిల్లా మహిళా రెజ్లర్‌లను మంగళవారం స్థానిక పాత నగరంలో గల రీడింగ్ రూమ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు డాక్టర్ ఎమ్‌వివిఎస్ మూర్తి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వి క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉందని, క్రీడాకారుల కోసం స్టేడియంల నిర్మాణంతోపాటు అంతర్జాతీయ స్థాయి పోటీలను విశాఖలో నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారన్నారు. నిరంతర సాధనతోపాటు స్వయంకృషితో ఎదుగుతున్న మహిళా రెజ్లర్‌లకు ఒలింపిక్ క్రీడల్లో పతకాలు తేగల సామర్ధ్యం ఉందని ప్రశంసించారు. జిల్లా మహిళా రెజ్లింగ్ జట్టు కెప్టెన్ జి.వరలక్ష్మి, ఇతర సభ్యులు జ్యోతి, నాగలక్ష్మి, శ్రీదేవిలను ఆయన అభినందించారు. కార్యక్రమంలో జిల్లా రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు శివశంకర్, కోచ్ పాండ్రంగి ఉప్మాకరరావు, రీడింగ్ రూమ్ కార్యదర్శి సూరిబాబు, టిడిపి సీనియర్ నాయకులు రెహ్మాన్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా
గీతం విద్యార్థుల కేక్ మిక్సింగ్
జగదాంబ, డిసెంబర్ 6: ఈ నెల 9వ తేదీ నుంచి గీతం విశ్వవిద్యాలయం వేదికగా జరుగనున్న జాతీయ స్థాయి యువజనోత్సవ గీతం ఎక్స్‌ప్రెస్ మీట్-2016కు ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో జరిగిన జెమ్ కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో విద్యార్థీనులు పెద్దఎత్తున పాల్గొన్నారు. స్థానిక ఆల్కాస్ కిజెన్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిని కార్యక్రమంలో విద్యార్ధీనులు కేక్ తయారీ మిశ్రమంతో పాటు భారీగా వంద కిలోల కేక్‌ను తయారుచేశారు. విద్యార్ధుల ఆనందోత్సహం మధ్య కేవలం అరగంటలో కేక్‌ను తయారు చేసి అందించారు. గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.షీలా, విద్యార్ధి వ్యవహారాల విభాగం చైర్‌పర్సన్ డాక్టర్ కె.మంజుశ్రీనాయుడు తదితరులు పాల్గొన్నారు.