విశాఖపట్నం

క్యాష్ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 11: నోట్ల రద్దు జరిగి నెల పూర్తయింది. రెండవ మాసాంలోకి అడుగుపెట్టాం. అయినా సమస్య తీరడంలేదు. ఇది ఒక కొలిక్కి రావడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తే ఏమీ పట్టించుకోవడంలేదు. పైగా రోజుకో సమస్యను సృష్టిస్తున్నాయి. దీంతో సామాన్యుల వెతలు అన్నీ ఇన్నీ కాకుండా పోతున్నాయి. నెలంతా చెమటోడ్చి పని చేసినా వేతనం చేతికందక సామన్య ఉద్యోగులు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అప్పుడే నెలలో సగం రోజులు అయిపోతున్నాయి. ఈపాటికి గత నెల జీతం ఖర్చు చేసే సామాన్య ఉద్యోగులు చేబదుళ్ళు, అప్పుల కోసం పరుగులు తీస్తుండాలి. అటువంటిది అసలు జీతమే చేతికందని పరిస్థితులు. విశాఖ నగరంలో ఎటిఎంలు ఎక్కడా తెరుచుకోవడంలేదు. వీటి షట్టర్లు దించి, తాళాలు వేసి ఉంటున్నాయి. మరికొన్నింటికీ ‘నో క్యాష్’ బోర్డులు తగిలించి దర్శనమిస్తున్నాయి. బ్యాంకుల సంగతి ఇక చెప్పనక్కర్లేదు. నోట్ల రద్దు మొదటి రెండు వారాలే సెలవు రోజుల్లోను తెరిచి ఉండేవి. ఆ తరువాత నుంచి వీటికి వరుస సెలవులే. రెండ శనివారం, ఆదివారం, సోమవారం మిలాద్-ఇన్-నబి పండగ వలన బ్యాంకులు తెరుచుకునే పరిస్థితుల్లేవు. ఇక మంగళవారం వస్తే ఏ విధమైన సమస్యిలుంటాయోనన్న భయం ప్రతిఒక్క సామాన్యునిలో పట్టుకుంది. నెలంతా వాడుకునే పాలు, కిరణా, చాకలి, టివీ ఛానళ్ళు, పిల్లల స్కూల్ ఫీజులు, గ్యాస్, కూరగాయల కోసం ఏం చెప్పాలో తెలియక సామాన్య, మధ్యతరగతి వర్గాలు నలిగిపోతున్నాయి. ఉద్యోగులు విధులకు వెళ్ళిపోతుండగా, తప్పించుకోలేని గృహిణులు మాత్రం వచ్చేపోయే వారికి చెప్పలేక పరువు నిలబెట్టుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు.
పెళ్ళిళ్ళ సీజన్‌తో అవస్థలు
అసలే పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో విందులో పాల్గొని దంపతుల్ని ఆశీద్వరించి బహుమతులు, కట్నాలు చదివించేందుకు, వేడుకల వద్దకు వెళ్ళేందుకు సైతం చేతిలో చిల్లిగవ్వలేక ఇంటి గుమ్మ నుంచి బయటపడలేక నానా అగచాట్లు పడాల్సి వస్తుందని సామాన్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గత నెల రోజులుగా అడపాదడపా పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి. వీటికి పెండ్లి పిలుపు పేరుతో ఇళ్ళకు కార్డులు వస్తున్నాయి. అలాగే శుభకార్యాలకు వెళ్ళాలంటేనే కనీసం రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు అవసరం ఉంటుంది. జీతాలు రాక, అప్పులో దొరక్క తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్న సామాన్యులు 60 నుంచి 70 శాతం మేర ఉంటున్నారు. అలాగే ఆదివారం అనేసరికి ఇంటిలో కూరలతోపాటు, మాంసం, గుడ్లుచేపలు కొనుగోలు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. కార్తీకమాసం ముగియడంతో ఇక వ్యాపారానికి ఢోకాలేదనుకునే చేపలు, మాంసం వ్యాపారులు నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా చూపడంతో ఢీలా పడుతున్నారు. ఒక్కరంటే ఒక్కరూ కొనుగోలు చేయని పరిస్థితులు వీరికి తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతున్నారు. కర్రి పాయింట్లు, కిరణా, పాల, కూరల దుకాణాలు, హోల్‌సేల్ మార్కెట్లలో సైతం వినియోగదారుల సందడి కనిపించడంలేదు. చివరకు నిర్మాణ రంగంపైని నోట్ల ప్రభావం చూపుతోంది. ఇవి నత్తనడకన సాగుతున్నాయి. ఈ విధంగా ప్రతిఒక్క వృత్తిపైనే ప్రత్యక్షంగా పడటంతో సామన్యులు విలవిల్లాడుతున్నారు. ప్రధానంగా రెండు వేల నోట్‌తో చిల్లర లభించక, వంద నోట్లు అందుబాటులోకి లేక ఇబ్బందులు మరింతగా పెరుగుతున్నాయి.