విశాఖపట్నం

రైళ్ల రాకపోకలకు వార్ధా ఎఫెక్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 13: వార్ధా తుపాను ప్రభావం ఇంకా రైళ్ళపోకలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. విశాఖ-చెన్నై మధ్య పలుచోట్ల రైల్వేట్రాక్ దెబ్బతినడం, పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నందున ఈ మార్గంలో నడిచే పలు ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్‌లు రద్దయ్యాయి. మరికొన్ని దారిమళ్ళింపులో నడుస్తున్నాయి. దీనివల్ల విశాఖ నుంచి చెన్నైతోపాటు పలు దూర ప్రాంతాలకు తరలివెళ్ళే ప్రయాణికులకు గత రెండు రోజులుగా ఇబ్బందులు తప్పడంలేదు. విశాఖ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫారాలపై ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఇంటిళ్ళపాది వెళ్ళే వారి పరిస్థితి చెప్పనక్కర్లేదు. అసలే ఉష్ణోగ్రతలు పడిపోవడం, చలి తీవ్రత పెరుగుతున్నందున ప్రయాణికుల కష్టాలు అన్నీఇన్నీకాకుండా పోతున్నాయి. రైళ్ళ రాకపోకల గురించని సమాచారం అందక మరికొన్ని ఇబ్బందులు తప్పడంలేదని ప్రయాణికులు చెబుతున్నారు.
* రైళ్ళ రద్దు...
విశాఖపట్నం-చెన్నై (సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, 22869) చెన్నైలో ఈ నెల 12వ తేదీన బయలుదేరాల్సి ఉంది. వార్దా తుపాను ప్రభావంతో దీనిని రద్దు చేశారు. అలాగే చెన్నై సెంట్రల్ - హౌరా మెయిల్ ఎక్స్‌ప్రెస్ (12840) చెన్నైలో ఈ నెల 12వ తేదీన బయలుదేరాలి. దీనిని రద్దు చేసినట్టు ఇక్కడి అధికారులు ప్రకటించారు. చెన్నై సెంట్రల్ - పూరి వీక్లీ సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22860) చెన్నైలో ఈ నెల 12వ తేదీన బయలుదేరాల్సి ఉండగా ఇది కూడా రద్దయ్యింది. చెన్నై సెంట్రల్ - గౌహతి ఎక్స్‌ప్రెస్ (15629) చెన్నైలో ఈ నెల 12న బయలుదేరాలి. చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ (22870) చెన్నైలో మంగళవారం బయలుదేరాల్సి ఉండగా ఈ రెండు రద్దయ్యాయి.
* మళ్ళింపు మార్గంలో నడిచే రైళ్ళు...
మరికొన్ని రైళ్ళను దారి మళ్ళించడం ద్వారా యథావిధిగా నిర్వహిస్తున్నట్టు వాల్తేరు డివిజన్ అధికారులు తెలిపారు. గౌహతి-బెంగుళూరు కంటోన్‌మెంట్ ఎక్స్‌ప్రెస్ (12510) ఈ నెల 11వ తేదీన గౌహతిలో బయలుదేరాల్సి ఉండగా దీనిని రేణిగుంట, మేలపాకం, కాట్పాడి రైల్వేస్టేషన్ల మీదుగా నడుపుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే షాలిమర్ - త్రివేండ్రం సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (22642) ఈ నెల 11వ తేదీన బయలుదేరగా, ఇది కూడా రేణిగుంట, మెల్‌పాకం, కాట్పాడి స్టేషన్ల మీదుగా నిర్వహిస్తున్నారు. హౌరా - తిరుచ్చీరాపల్లి ఎక్స్‌ప్రెస్ (12663) హౌరాలో ఈనెల 11వ తేదీన బయలుదేరగా ఇది గూడూరు, రేణిగుంట, తిరుపతి, కాట్పాడి స్టేషన్ల మీదుగా మళ్ళింపు మార్గంలో నడుస్తుంది. వీటితోపాటు ప్రధానమైన ధన్‌బాద్ - అలెప్పీ ఎక్స్‌ప్రెస్ ఇ(13351) ధన్‌బాద్‌లో ఈ నెల 11వ తేదీన బయలుదేరింది. ఇది దారి మళ్ళింపులో అంటే గూడూరు, రేణిగుంట, తిరుపతి, కాట్పాడి రైల్వేస్టేషన్ల మీదుగా నడుస్తుంది.