విశాఖపట్నం

బ్యాంకులు కిటకిట...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 13: నగదు ఇక్కట్లు ప్రజలను విడిపెట్టేట్టు లేదు. నోట్ల రద్దు ప్రకటన వెలువడి 35 రోజులు దాటినా నోట్ల కష్టాలు మాత్రం యధాతధంగా కొనసాగుతూనే ఉన్నాయి. నోట్ల రద్దు అనంతరం ఈ ఇబ్బందులు తాత్కాలికమే అంటూ జరిగిన ప్రచారాన్ని అర్ధం చేసుకున్న ప్రజలు కరెన్సీ కష్టాలు రోజురోజుకీ తీవ్రతరం కావడంతో ఇప్పుడు పాలకుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. నోట్ల రద్దు అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ అడిగిన 50 రోజుల గడువులో ఇప్పటికే 35 రోజులు పూర్తయిందని, మరో 15 రోజుల్లో కరెన్సీ కష్టాలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం లేదంటూ బ్యాంకుల వద్ద నిరీక్షిస్తున్న సామాన్యులు వాఖ్యానిస్తున్నారు. తాజాగా బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో మంగళవారం ఉదయం నుంచి బ్యాంకుల వద్ద జనం బారులు తీరారు. మూడు రోజుల పాటు మూత బడిన బ్యాంకులు తెరచుకోవడమే తడవుగా వందల సంఖ్యలో ఖాతాదారులు బ్యాంకులను ఆశ్రయించారు. నగదు తీసుకునేందుకు ఖాతాదారులు భారీగా చేరుకోవడంతో పలు బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు దర్శనమిచ్చాయి. ఉదయం నుంచి పడిగాపులు పడినప్పటికీ బ్యాంకుల నుంచి నిబంధనల మేరకు సొమ్ము తీసుకోలేకపోయారు. వారానికి రూ.24వేల తీసుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ బ్యాంకుల వద్ద నిల్వలు తక్కువగా ఉండటంతో విత్‌డ్రాలపై అధికారులే ఆంక్షలు విధించారు. కొన్ని బ్యాంకుల్లో రూ.10వేలకు మించి ఖాతాల నుంచి తీసుకునేందుకు వీలు లేదంటూ స్పష్టం చేయడంతో ఖాతాదారులకు పాలుపోలేదు. దీంతో కొంతమంది ఖాతాదారులు బ్యాంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగడం కన్పించింది. తమ ఖాతాలో సొమ్ము తీసుకునేందుకు ఆంక్షలేంటంటూ ఎదురు తిరగడంతో నగదు కొరత కారణంగానే పరిమితి విధించామంటూ బ్యాంకు మేనేజర్లు నచ్చచెప్పే ప్రయత్నం చేయడం కన్పించింది. జిల్లా వ్యాప్తంగా జాతీయ, ప్రైవేటు, సహకార రంగాలకు చెందిన 48 బ్యాంకులకు సంబంధించి 738 శాఖలు పనిచేస్తున్నాయి. దాదాపు అన్ని బ్యాంకుల వద్ద ఇదే పరిస్థితులు నెలకొన్నాయి.పలు బ్యాంకుల్లో నగదు తీసుకునే వారికి రూ.2000 నోట్లు ఇవ్వడంతో ఖాతాదారులు వీటిని వద్దంటూ తిరస్కరించడం కన్పించింది. అయితే తమ వద్ద ఉన్న నగదు మొత్తం ఈ నోట్లేనని చెప్పడంతో గత్యంతరం లేక వాటినే తీసుకున్నారు. జిల్లాకు వచ్చిన నగదులో రూ.500 నోట్లు ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెలామణిలోకి రాకపోవడం గమనార్హం. ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్‌లకు రూ.500నోట్లు వచ్చినట్టు ప్రచారం జరిగి, రెండు రోజుల పాటు వీటిని చెలామణిలోకి తెచ్చారు. అయితే గత వారం రోజులుగా ఎక్కడా రూ.500 నోట్లు బహిరంగ మార్కెట్‌లో చెలామణి కాకపోవడంతో కరెన్సీ కష్టాలు యధాతధంగా కొనసాగుతున్నాయి.
యధావిధిగా ఎటిఎంల మూత
ఇక ఎటిఎంల పరిస్థితి నెల దాటిన తర్వాత కూడా ఎటువంటి మార్పు కన్పించలేదు. నగదు కష్టాలు మొదలై నెల దాటుతుండగా, బ్యాంకుల్లో కొంతమేర నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే ఎటిఎంల పరిస్థితిలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. జిల్లా వ్యాప్తంగా 1,143 ఎటిఎంలు ఉండగా, మంగళవారం తెరచుకున్నవి కేవలం 280 మాత్రమే. ఇక్కడ కూడా రూ.2000 నోట్లే అందుబాటులో ఉండటంతో ఖాతాదారులకు ఇబ్బందులు తప్పలేదు. భారీ క్యూలైన్లలో నిల్చుని ఎదురు చూసిన వారికి కొద్ది సేపటిలోనే నగదు లేనట్టు సమాచారం అందడంతో చేసేదేమీ లేక తిరిగి వెళ్లిపోవడం కన్పించింది. సిబిఐ, ఎస్‌బిహెచ్, ఆంధ్రాబ్యాంకుతో పాటు మరికొన్ని బ్యాంకుల ఎటిఎంల్లో మాత్రమే నగదు నింపడంతో ఖాతాదారులంతా వాటినే ఆశ్రయించాల్సి వచ్చింది. అదికూడా బ్యాంకు ఆవరణలోని ఎటిఎంల్లోనే నగదు పెట్టడం వల్ల దూరాబారమైనా జనం పరుగులు తీశారు.