విశాఖపట్నం

ఇ-గవర్నెన్స్ జాతీయ సదస్సుకు పటిష్ట ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 20: విశాఖ వేదికగా జనవరి 9, 10 తేదీల్లో ఇ-గవర్నెన్స్‌పై జరుగుతున్న 20వ జాతీయ సదస్సుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సదస్సు నిర్వహణకు ఏర్పాటు చేసిన పలు కమిటీలు, ఈవెంట్ మేనేజింగ్ ఏజెన్సీ యాక్సెస్ ఈవెంట్స్ ప్రతినిధులతో మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సమావేశమై కమిటీల వారీగా పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిక్స్, భాగస్వామ్య సదస్సులకంటే పెద్దఎత్తున సమారు 1200 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుతారని అందనావేయడం జరిగిందన్నారు. అందుకు తగ్గట్టుగా వసతి, భోజన రవాణా, బందోబస్త్, ప్రొటోకాల్ ఏర్పాట్లు చేయాలని, నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ రెండు రోజుల సదస్సు హోటల్ నొవెటల్‌లో నిర్వహిస్తున్నందున, వి-కనె్వక్షన్ హాలులో ప్రారంభ, ముగింపు వేడుకలు, ప్లీనరీ సెషన్సు నిర్వహణకు వీలుగా వేదికగా, సీటింగ్ ఏర్పాట్లు చేయాలని వేదిక కమిటీ ఇన్‌చార్జి ఎమ్.మహేశ్వరరెడ్డిని ఆదేశించారు. ముఖ్యమంత్రితోపాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ సదస్సుకు హాజరుతారని, ప్రొటోకాల్ ప్రకారం వారికి అవసరమైన రవాణా, వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. పలు రాష్ట్రాల నుండి వచ్చే ప్రతినిధుల సాదరంగా ఆహ్వానించేందుకు విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌లలో ప్రత్యేక రిజిస్ట్రేషన్, రిసెప్షన్ కౌంటర్ల ఏర్పాట్లు చేయాలని ప్రొటోకాల్ కమిటీ ఇన్‌చార్జి డిఆర్‌ఓ సి.చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు బస చేసేందుకు వీలుగా నరగంలోనున్న అన్ని స్టార్ హోటళ్ళల్లో గదులను జనవరి 8,9,10 తేదీల్లో మూడు రోజులపాటు బ్లాక్ చేయాలని ఎకామడేషన్ కమిటీ ఇన్‌చార్జిని ఆదేశించారు. ఇప్పటికే నగరంలో పలు హోటళ్ళల్లో 500 గదులను బ్లాక్ చేశామని ప్రొటోకాల్ ఇన్‌చార్జి కలెక్టర్‌కు తెలిపారు. అయితే అవి చాలకపోవచ్చని మరిన్ని గదులను బ్లాక్ చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖుల రవాణాకు 610 వాహనాలు అవసరం అవుతాయని తాత్కాలికంగా అంచనా వేయడం జరిగిందన్నారు. వాటిని సిద్ధం చేయాలని రవాణా కమిటీ ఇన్‌చార్జి డిటిసి ఎస్.వెంకటేశ్వరరావును ఆదేశించారు. జనవరి 9వ తేదీ రాత్రి కైలాసగిరి, ది పార్కు హోటల్‌లో అతిథులకు డిన్నర్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు తగిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నాస్కమ్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. ఈవెంట్ మేనేజింగ్ ఏజెన్సీ యాక్సెస్ ఈవెంట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సత్యధనుష్, ఎమ్‌హెచ్ ప్రసాద్, జెసి-2 డి వెంకటరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సి.చంద్రశేఖరరెడ్డి, ఏపిఐఐసి ఇడి ఎం.మహేశ్వరరెడ్డి, డిఆర్‌డిఏ పిడి సత్యసాయి శ్రీనివాస్, పర్యాటక సంస్థ ఇడి శ్రీరాములు నాయుడు, జీవిఎంసి అదనపు కమిషనర్ జివివిఎస్ మూర్తి, వుడాకార్యదర్శి శ్రీనివాస్, ఏడిసిపి పివి రవికుమార్, ఎస్‌డిసి గోవిందరాజులు, ఏ.శిరి, గృహనిర్మాణ సంస్థ పిడి ప్రసాద్, జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.