విశాఖపట్నం

సమాన పనికి సమాన వేతనమివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 22: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సంస్థలు, ప్రైవేటు పరిశ్రమల్లో పర్మినెంట్ కార్మికులతో సమానంగా పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22న దేశవ్యాప్త ఆందోళనకు సిఐటియు ఆలిండియా కమిటీ పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా గురువారం సరస్వతీ పార్కు నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్ధేశించి సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్. నర్సింగరావు ముఖ్య ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్త ఆందోళనకు సిఐటియు ఆలండియా కమిటీ పిలుపునిచ్చిందన్నారు. ఇందులో భాగంగా సరస్వతీ పార్కు నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ పరిశ్రమలు, సంస్థలు, ప్రైవేటు పరిశ్రమల్లో పర్మినెంట్ కార్మికులతో సమానంగా జీతాలు చెల్లించాలని సుప్రీం కోర్టు అక్టోబర్ 26న చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందన్నారు. ఈ తీర్పు ప్రకారం పర్మినెంట్ కార్మికులతో సమానంగా పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం పేస్కేలు, కరవుభత్యంతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని రాజ్యాంగ చట్టంలోని ఆర్టికల్స్ 14, 16 39 (డి)ల్లో పేర్కొనబడిందని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారన్నారు. దీని ప్రకారం దేశంలో ఏ పరిశ్రమలోనైనా ఒకే పని చేస్తున్న కాంట్రాక్ట్, క్యాజువల్ కార్మికులకు పర్మినెంట్ కార్మికులతో సమానంగా జీతాలు చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను అసమానత, అణిచివేతలకు గురిచేయడం, బెదిరించి తక్కువ జీతానికి పని చేయించడం తప్పుడు పరిస్థితి అని సుప్రీం కోర్టు తీవ్రంగా విమర్శించిందని, కాంట్రాక్ట్ కార్మికుల కష్టార్జితం వారికి చెందకుండా దోపిడీ చేయడాన్ని సుప్రీం కోర్టు తప్పు బట్టిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్, బిహెచ్‌ఇఎల్, షిప్‌యార్డు, హెచ్‌పిసిఎల్, పోర్టు, డిసిఐ, బిఎస్‌ఎన్‌ఎల్, డాక్‌యార్డు, రైల్వే, మునిసిపల్, ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్‌టిసి, విద్యుత్ తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో సొసైటీలు, సిరీస్‌లు, క్యాజువల్, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, డైలీవేజ్ తదితర పేర్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేయించుకుంటున్నాయన్నారు. వీటిలో ఒక పర్మినెంట్ కార్మికునికి నెలజీతం 40 వేలు అయితే అదే పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికునికి ఏడు వేల నుండి పదివేలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. సిఐటియు గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ పర్మినెంట్ కార్మికులకు జీతాలు చెల్లించడం ఎంత న్యాయమో, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా అంతే న్యాయంగా జీతాలు పెంచాలన్నారు. స్ర్తి, పురుషుల మధ్య కూడా వ్యత్యాసం వుండకూడదని సుప్రీం కోర్టు తీర్పులో స్పష్టంగా పేర్కొందన్నారు. చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వాలే చట్ట విరుద్ధంగా వ్యవహరించడం అన్యాయమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తరువాతనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానపనికి సమాన వేతనం అమలుకు చర్యలు చేపట్టాలన్నారు. దీనిలో సిఐటియు కార్యదర్శి శ్రీనివాసరావు, ఎలక్ట్రిసిటీ ఎంప్లారుూస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు జిఎస్ రాజేశ్వరరావు, కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శర్మ, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఫెడరేషన్ నాయకులు ఎస్.ఇందీవర, షిప్‌యార్డు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఆర్.లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు.