విశాఖపట్నం

పండగ చేస్కోండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి(నెహ్రూచౌక్), డిసెంబర్ 23: అన్ని వర్గాల వారు తమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చంద్రన్న కానుకలపథకాన్ని ప్రవేశపెట్టారని తద్వారా రంజాన్, క్రిస్మస్ సంక్రాంతి పండుగలకు చంద్రన్న కానుకలను అందజేస్తున్నారని, ప్రతీ ఇంట పండుగ చేసుకుని తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలంటూ విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం అనకాపల్లి విచ్చేసిన ఆయన స్థానిక పూడిమడక రోడ్డులోగల కేథలిక్ చర్చిను సందర్శించారు. ఈ సందర్భంగా చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఫాదర్ మంత్రి గంటాను, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణలను ప్రార్ధనలు జరిపి దీవించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ సరుకులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్స్‌కు క్రిస్మస్ కానుకగా 275 రూపాయల విలువ గల వస్తువులను సిఎం చంద్రబాబు కానుకగా పంపిణీ చేశారని, అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి పండుగలో భాగంగా కూడా చంద్రన్న కానుకలు అందజేస్తారని ఆయన అన్నారు.దేశంలో ఎక్కడా ఇటువంటి పంపిణీ జరగలేదని, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఇటువంటి కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పద్మావతి, టిడిపి నాయకులు బుద్ద నాగజగదీష్, మళ్ల సురేంద్ర, నడిపల్లి గణేష్, డాక్టర్ విష్ణుమూర్తి, సత్యవతి, పలకా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సభ్యత్వాలెందుకు పెరగట్లేదు?
* పట్టాలిచ్చాం కదా అంతా మనవెంటే అనుకోవద్దు
* లబ్ధిపొందిన వారంతా ఓట్లేస్తారనుకుంటే పొరపాటే
* నగర నేతలకు బాబు క్లాస్

విశాఖపట్నం, డిసెంబర్ 23: అధికారం చేపట్టి రెండున్నరేళ్లలో ప్రజలకు ఎంతో చేశాం. హుదూద్ వంటి తుపాను నగరాన్ని అతలాకుతలం చేస్తే సమర్ధవంతంగా పనిచేసి పూర్వస్థితికి తీసుకువచ్చాం. ఇటీవలే సుమారు 30వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. ఇప్పటి వరకూ దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఒకే సారి అంతమందికి సుమారు రూ.4,500 కోట్ల మేర లబ్ధి చేకూర్చే విధంగా పట్టాల పంపిణీని చేపట్టాం. అయితే నగరంలో టిడిపి సభ్యత్వ నమోదు మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు. దీనికి కారణం ఏమిటి. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎక్కడ తడబడుతున్నాం. ఇది సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో గురువారం జరిగిన పార్టీ సమావేశంలో ప్రసంగ సందేశం. త్వరలో జరగనున్న జివిఎంసి ఎన్నికల నాటికి ఇదే పరిస్థితులు కొనసాగితే ఫలితాలు ఎలా ఉంటాయో ఆలోచించుకోండంటూ హితబోధ చేశారు. పట్టాలు ఇచ్చాం కదా, ఇక మనకే ఓట్లేస్తారనుకుంటే పొరపాటేనని, పార్టీ పరంగా తాము మీకు అండగా ఉంటామన్న భరోసా ప్రజలకు కల్పించాలని సూచించారు. నగరంలో ఎమ్మెల్యే పనితీరును ప్రస్తావిస్తూ ఒకరిద్దరు మాత్రమే ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, పట్టు సాధిస్తున్నారని, మిగిలిన వారు మాత్రం పార్టీ, ప్రభుత్వం చూసుకుంటుందన్న ధోరణిలో ఉన్నారని హెచ్చరించారు. మనతో పోలిస్తే వెనుకబడిన ఒడిశా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల అమలు అంతంతమాత్రమే అయినప్పటికీ నవీన్ పట్నాయక్ సాధిస్తున్న విజయాలను చంద్రబాబు ప్రస్తావించారు. పార్టీని ప్రజలకు చేరువ చేయడం ద్వారానే ఒడిశాలో వరుస గెలుపు సాధ్యమైందని గుర్తు చేశారు. ఇప్పటికైనా పార్టీ వర్గాలు ప్రజలతో మమేకం కావాలని హితవు పలికారు.