విశాఖపట్నం

మార్చికి ముగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 27: జిల్లాలో ఇప్పటికీ ప్రారంభం కాని ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పిఎంజిఎస్‌వై) పనులు మార్చి మాసాంతానికి పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. సడక్ యోజన పనుల ప్రగతిపై మంత్రి అయ్యన్న, ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ సివిఎస్ రామ్మూర్తితో కలిసి జెడ్పీ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్, అటవీ శాఖల అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మూడేళ్లు దాటినా పిఎంజెఎస్‌వై పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 92 పనుల్లో రూ.100 కోట్ల విలువైన 45 పనులను మార్చి మాసాంతానికి పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ధేశించిన గడువులోగా పనులు పూర్తి చేయని పక్షంలో ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పనులు జరుగుత్నున తీరుపై మంత్రి మండిపడ్డారు. పాడేరు డివిజన్‌లో అత్యధికంగా పనులు పెండింగ్‌లో ఉన్నాయని, దీనికి అధికారులు కుంటి సాకులు చెప్పడాన్ని తప్పుపట్టారు. ఏజెన్సీ పరిధిలో పనులు నిలిచిపోవడానికి అటవీ అనుమతులు, నక్సలైట్ల సమస్యను అధికారులు ప్రస్తావించారు. దీనిపై మంత్రి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 శాతం పనులకు జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే అటవీ అనుమతులు సాధించుకునే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఆదిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఆన్‌లైన్ అనుమతుల విషయంలో పనుల్లో జాప్యం లేకుండా అటవీశాఖ అధికారులు ఇంజనీరింగ్ అధికారులకు సహకరించాలని ఆదేశించారు. అలాగే జరుగుతున్న పనులను తరచు సమీక్షించడం ద్వారా వేగంగా పూర్తయ్యేలా చూడాలని ఇంజనీరిన్ ఇన్‌చీఫ్ రామ్మూర్తిని ఆదేశించారు. నిధులకు లోటు లేనప్పటికీ పనులు జాప్యం చేయడాన్ని క్షమించనని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో అంతర్గత రహదార్ల నిర్మాణంలో అగ్రస్థానంలో నిలవాలని మంత్రిగా తాను భావిస్తే అధికారులు నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిలో 500 కిలోమీటర్ల మేర సిమ్మెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 339 కిలోమీటర్ల మేర మాత్రమే చేసేందుకు ప్రతిపాదించారని అన్నారు. అదికూడా 280 కిమీ మాత్రమే పూర్తి చేశారని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన లక్ష్యాన్ని మార్చి మాసాంతానికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకుని పనిచేయాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ పాలనాపరంగా నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి 15 రోజులకు ఒక సారి విశాఖ వచ్చి ప్రగతిపై సమీక్షించాలని ఇఎన్‌సి రామ్మూర్తిని ఆదేశించారు. నిర్మాణ పనులకు అవసరమైన సిమెంట్ నిల్వలను సమకూర్చే బాధ్యత జిల్లా అధికారులదేనన్నారు. దీనికోసం ఇంజనీరింగ్ అధికారులు సిమెంట్ కంపెనీల చుట్టూ తిరిగి కాలం వృధా చేసుకోవద్దన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సిమెంట్ సరఫరా అయ్యే విధంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ మావోయిస్టుల వంకతో ఏజెన్సీలో రోడ్ల నిర్మాణం జాప్యం చేయవద్దని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. మావోయిస్టుల సమస్యను అధిగమించేందుకు జిల్లా పోలీసు అధికారుల సహకారం తీసుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆన్‌లైన్ చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించేందుకు ఇంజనీరింగ్, అటవీ అధికారులు ప్రత్యేక ప్రతినిధులను నియమించుకోవచ్చని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్‌ఇ గజేంద్ర, జెడ్పీ సిఇఓ జయప్రకాష్ నారాయణ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ప్రభాకరరావు, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.