విశాఖపట్నం

దీపాల వెలుగులో శ్రీరంగనాథుడ్ని దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జనవరి 3 :శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయాల్లో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా తిరుప్పావై పాశుర విన్నపాలు వేడుకగా జరుగుతున్నాయి. శ్రీ రంగనాథుడ్ని పోందడం కోసం గోదాదేవి రచించి, గానం చేసిన పాశురాలలో మంగళవారం 19వ పాశురాన్ని అర్చకులు గానం చేస్తూ అమ్మవారికి సమర్పణ చేసారు. ‘ కుత్తు విళక్కెరియ కొట్టుక్కాల్ కట్టిల్మేల్..’ అంటూ సాగిన ఈ పాశుర విశేషాన్ని దేవాలయ వైదిక పెద్దలు వివరించారు. గోపికలంతా కలిసి వెళ్ళి శ్రీరంగనాథుడ్ని మేల్కొలుపుతారని, ఈ నేపథ్యంలో దీపాల వెలుగులో శయనిస్తున్న స్వామివారిని దర్శించుకుంటారని వైదిక పెద్దలు వివరించారు. ఈ వేడుకలో భాగంగా సింహాచలేశుని దేవాలయంలో స్వామివారి తిరువీధి మహోత్సవం సంప్రదాయంగా జరిగింది. వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో స్వామివారు, అమ్మవార్ల అంకరణలు భక్తులను విశేషంగా అకట్టుకున్నాయి. పరిమళ శోభితమైన పుష్పమాలికతో సుందరంగా తీర్చిదిద్దిన శేషతల్పం పై శయనిస్తున్న రంగనాథుడ్ని దీపాల వెలుగులో దర్శించునే అదృష్టాన్ని కలగజేస్తూ అర్చకులు చేసిన ఏర్పాట్లతో భక్తులు ఆనంద పరవశులయ్యారు. గోవిందనామస్మరణతో దేవాలయం మారుమోగింది. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
సింహాద్రినాథుడ్ని దర్శించుకున్న ప్రముఖులు
సింహాచలం, జనవరి 3 :ఎ పి సి ఒ బి చైర్మన్ పి. వెంకటేశ్వరరావు, 12 మంది డిసిసిబి అధ్యక్షులు మంగళవారం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. దేవాలయ అధికారులు వీరికి పూర్ణకలశతో సంప్రదాయంగా స్వాగతం పలికారు. కప్పస్తంభం అలింగనం చేసుకున్న ప్రముఖులు స్వామివారిని ప్రార్థించుకున్నారు. అంతరాలయంలో వీరి పేరున అర్చకులు ప్రత్యేక పూజలు చేసారు. బేడామండపంలో అర్చకులు ప్రముఖులను ఆశీర్వదించారు. అధికారులు వీరికి ప్రసాదాలు అందజేసారు.

తెరచుకోని ఎటిఎంలతో పరేషాన్

విశాఖపట్నం, జనవరి 3: పెద్ద నోట్ల రద్దు నేపధ్యంలో నూతన సంవత్సరం తొలిరోజు నుంచి ఖాతాదారులకు కేంద్రం కాస్తంత వెసులుబాటు కల్పించింది. ఏటిఎంల ద్వారా ఇప్పటి వరకు తీసుకునే రెండువేల రూపాయల పరిమితిని రూ.4,500కు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో వీరికి ఊరట కల్పించినట్టు అయ్యింది. అయితే ఈ సదుపాయం ఖాతాదారులకు ఏమాత్రం అందుబాటులోకి రావడంలేదు. ఎందుకంటే అసలు ఎటిఎంలే తెరుచుకోవడంలేదు. దీనికి అనేక కారణాలు చెబుతున్నారు. కొత్త రూ.500 నోట్లను ఏటిఎంలకు అనుగుణంగా ఇందులో ఏర్పాటు చేయలేకపోవడం, అలాగే వంద నోట్ల కొరతతో విశాఖ నగరంలోని చాలా ప్రాంతాల్లో ఏటిఎంలు మూతపడ్డాయి. నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలైన వెంకోజిపాలెం ఎస్‌బిహెచ్ ఏటిఎం గత కొంతకాలంగా మూతపడి ఉంది. అలాగే ఎంవిపి సర్కిల్ సమీపానున్న ఐసిఐసిఐ ఏటిఎంలో ఎపుడూ సాంకేతికపరమైన సమస్యలే. ఇసుకతోట, హెచ్‌బి కాలనీ, సీతమ్మధార, రామ్‌నగర్, వన్‌టౌన్, ఆదర్శనగర్, మర్రిపాలెం, కంచరపాలెం, మురళీనగర్, లాసెన్స్‌బేకాలనీ, ఎండాడ, పిఎం పాలెం, సాగర్‌నగర్, రుషికొండ తదితర ప్రాంతాల్లో ఏటిఎంలు మూతపడి కనిపిస్తున్నాయి. దీంతో ఖాతాదారులు అయోమయంలో పడుతున్నారు. అసలే సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. కొత్త దుస్తులు, మార్కెటింగ్ చేయడం, నిత్యావసరాల కొనుగోలు వంటి వాటికి అవసరమైన సొమ్ము చేతికందక నానా అవస్థలు పడుతున్నారు. నెలంతా కష్టించి పనిచేస్తున్నా జీతాలు చేతికందక, బ్యాంకుల వద్ద క్యూలతో రోజంతా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఖాతాదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోపక్క రెండు వేల నోట్లతో చిల్లర సమస్య తలెత్తుతుంది. మందుల దుకాణాల్లోను, కిరాణా దుకాణాలు, పెట్రోల్ బంక్‌ల్లో సైతం ఈ నోట్ల మార్పుకోసం అనేక పాట్లు పడాల్సి వస్తోంది. ఇంకోవైపు వంద నోట్ల కొరత ఇంకా వేధిస్తుండగా, కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి రావడంలేదు. వీటి కోసం ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు. ఎక్కడో ఒక చోట, పరిమితమైన బ్యాంకుల పరిధిలోనే ఇవి ప్రత్యక్షమవుతున్నాయి. నగర జనాభాకు, ఖాతాదారులకు అనుగుణంగా వీటిని దింపకపోవడంతో రూ.100, 500 నోట్ల కష్టాలు ప్రజలకు తీరడంలేదు. ఈ విధంగా కేంద్రం అనుమతించినా ఒకేసారి రూ.4500లు ఏటిఎంల ద్వారా తీసుకునే వీల్లేకుండా పోయింది. ఇది ఇపుడు పెద్ద సమస్యగా మారింది.