విశాఖపట్నం

రేపు విశాఖలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, జనవరి 7 : పెట్రోలియం అండ్ నాచురల్ గ్యాస్‌పై స్టడీటూర్ నిమిత్తం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విశాఖలో మూడు రోజుల పాటు పర్యటించనుంది. ఈనెల 9 నుండి 11 వరకు లోక్‌సభ సభ్యులు శ్రీప్రహ్లాద్‌జోషి అధ్యక్షతన 31 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల బృందం ఈ పర్యటనలో పాల్గొననుంది. ఈ బృందం 9 మధ్యాహ్నం ఒంటిగంటకు హెచ్‌పిసి ఎల్, మూడు గంటలకు ఐ ఎస్‌పి ఆర్ ఎల్‌ను సందర్శించి సంబంధిత అధికారులతో సమావేశం అవుతుంది. అలాగే 10 ఉదయం 9.30 గంటలకు పి ఎన్‌జి, ఒ ఐ ఎల్, 11 గంటలకు ఒ ఎన్‌జిసిని సందర్శిస్తుంది. 11న గెయిల్ అధికారులతో చర్చించిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు కమిటీ ముంబై బయలుదేరి వెళుతుంది.
భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పరిశీలన
జగదాంబ, జనవరి 7 : నగరంలో రెండు ముఖ్యమైన జాతీయ సదస్సులు జరగనున్న నేపథ్యంలో ఆయా ఏర్పాట్లను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ శనివారం పరిశీలించారు. హార్బర్ పార్కు ఎదురుగా ఉన్న ఎపి ఐ ఐసి మైదానంలో ఈనెల 27, 28 తేదీల్లో భాగస్వామ్య సదస్సు నిర్వహణపై కలెక్టర్ పరిశీలించారు. తాత్కాలిక షెడ్లు, రోడ్ల నిర్మాణం, అతిథులకు చేస్తున్న ఏర్పాట్లపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లోపాలు లేకుండా, వచ్చే ప్రతినిధులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. నోవాటెల్‌లో ఈ-గవర్నెన్స్‌పై జాతీయ సదస్సు జరుగుతున్న దృష్ట్యా అక్కడ చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ కమ్యూనికేషన్ కేంద్రాన్ని సందర్శించి ఆర్డీవో చంద్రశేఖరరెడ్డితో చర్చించారు.