విశాఖపట్నం

నిరుద్యోగులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 12: నగరంలో హోంగార్డుల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్‌ను నగర పోలీసు కమిషనరేట్ నుంచి విడుదలైంది. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తుల ఆహ్వానించింది. రోజువారీ వేతనం కింద రూ.400 తీసుకుని పనిచేయడానికి స్వర్గస్తులైన హోంగార్డులు, పోలీసు సిబ్బంది కుటుంబాలు, పోలీసు మినిస్టీరియల్ ఉద్యోగుల కుటుంబ సభ్యుల నుండి దరఖాస్తులు కోరింది. సంబంధిత అభ్యర్థి భారతీయ పౌరుడు అయి, 18 నుండి 50 ఏళ్ళ వయస్సులోపు కలిగి ఉంటూ కనీసం ఏడో తరగతి ఉత్తీర్ణత పొంది, నగరంలో పదేళ్ళు నివాస ధ్రువపత్రం లేదా నాలుగేళ్లు స్టడీ సర్ట్ఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరోగ్యంతోపాటు, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. వీరంతా దరఖాస్తుకు అర్హులుగా తెలిపింది. పూర్తిచేసిన దరఖాస్తులతోపాటు డెత్ సర్ట్ఫికెట్, లీగల్ ఎయిర్ సర్ట్ఫికెట్, విద్యార్హతల పత్రాలు, పోలీసు కమిషనర్ కార్యాలయంలో హోంగార్డు సెక్షన్‌నందు అందజేయాల్సిందిగా కార్యాలయ ప్రతినిధి సూచించారు.
సాంప్రదాయాలకు ప్రతిబింబం సంక్రాంతి
పరవాడ, జనవరి 12: భారతదేశ సాంస్కృతి, సంప్రదాయాలను ప్రతిభింభించే పండగ సంక్రాంతి అని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. సంక్రాంతి పండగ విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు ఇటువంటి సంబరాలు ఎంతగానో దోహద పడుతాయని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం పరవాడ జూనియర్ కళాశాల ఆవరణంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండారు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ సాంస్కృతి, సంప్రదయాలను చాటి చెప్పేందుకు పండగలు దోహదపడుతాయన్నారు. ప్రధానంగా హిందువులు అత్యధికంగా జరుపుకునే పండగల్లో సంక్రాంతి ఒక్కటి అన్నారు. సంక్రాంతి పండగను అధిక సంఖ్యలో రైతన్నలు జరుపుకుంటారన్నారు. భారతదేశానికి వెన్నుముక రైతన్న అని, రైతు పండించిన పంటను ఇంటికి తీసుకు వచ్చిన సందర్భంగా నిర్వహించుకునే పండగ సంక్రాంతి అన్నారు. నెల రోజులు పాటు సంక్రాంతి పండుగను నిర్వహించుకుంటారన్నారు. ప్రస్తు తం గ్రామాల్లో సంక్రాంతి కళ తప్పుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తుందన్నారు. సంక్రాంతి పండగ పల్లెలకు సరికొత్త అందాన్ని తీసుకు వస్తుందన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోలాటాలు, డూడూ బసవన్నలు, ఆటలు, ముగ్గులు పోటీలు, పశు ప్రదర్శన, పిండి వంటల ప్రదర్శన, వ్యవసాయ పనిముట్లు ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంబరాల్లో మండలాధ్యక్షులు మాసవరపు అప్పలనాయుడు, జెడ్పీటీసీ పయిల జగన్నాధరావు, మాజీ ఎంపీపీ మాధంశెట్టి నీలబాబు, మండల ప్రత్యేకాధికారి బి.విజయప్రసాద్, తహశీల్దార్ మల్లేశ్వరరావు, ఎండివో కరుణకుమారి, ఇవోఆర్‌డి హేమసుందర్, అధికారులు పోతల సత్యనారాయణ, ప్రమీల, డబ్ల్యూబి రాంబాబు, సర్పంచ్ చుక్క రామునాయుడు, పయిల శ్రీనివాసరావు, ఎంపీటీసీ పయిల రథాల సన్యాసిరావు, టీడీ పీ నాయకులు బొండా సన్నిదేముడు, వియ్యపు చిన్న పాల్గొన్నారు.